ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియా దానకర్ణుల్లో అదానీ

ABN, First Publish Date - 2022-12-07T02:27:34+05:30

ఫోర్బ్స్‌ ఏషియా దానకర్ణుల 16వ వార్షిక జాబితాలో ఆసియా కుబేరుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ సహా ముగ్గురు భారత బిలియనీర్లకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫోర్బ్స్‌ జాబితాలో ముగ్గురు భారత బిలియనీర్లకు చోటు

సింగపూర్‌: ఫోర్బ్స్‌ ఏషియా దానకర్ణుల 16వ వార్షిక జాబితాలో ఆసియా కుబేరుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ సహా ముగ్గురు భారత బిలియనీర్లకు స్థానం లభించింది. హెసీఎల్‌టెక్‌ గౌరవ చైర్మన్‌ శివ్‌ నాడార్‌, భారత ఐటీ రంగ ఆద్యుల్లో ఒకరు, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ చైర్మన్‌ అశోక్‌ సూతా ఈ లిస్ట్‌లో నిలిచిన మిగతా ఇద్దరు భారత బిలియనీర్లు. అంతేకాదు, మలేషియాలో స్థిరపడిన భారత సంతతి వ్యాపారవేత్త బ్రహ్మల్‌ వాసుదేవన్‌, ఆయన భార్య శాంతి కందియాకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ ఏడాది జూన్‌లో 60వ వసంతలోకి అడుగుపెట్టిన సందర్భంగా గౌతమ్‌ అదానీ సామాజిక కార్యక్రమాల కోసం రూ.60,000 కోట్లు విరాళంగా ప్రకటించారు. అదానీ ఫౌండేషన్‌ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. శివ్‌ నాడార్‌ విషయానికొస్తే, గడిచిన కొన్ని దశాబ్దాల్లో సామాజిక కార్యక్రమాల కోసం 100 కోట్ల డాలర్ల వరకు దానం చేశారు ఈ ఏడాదిలో ఆయన 14.2 కోట్ల డాలర్లు (రూ.11,600 కోట్లు) శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన వైద్య పరిశోధన ట్రస్ట్‌కు అశోక్‌ సూతా రూ.600 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Updated Date - 2022-12-07T02:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising