ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కాగా ఐపీఓ నిధుల వినియోగం

ABN, First Publish Date - 2022-01-18T10:27:29+05:30

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) నిధుల వినియోగ నిబంధనలను సెబీ మరింత కట్టుదిట్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాంకర్‌ ఇన్వెస్టర్ల 

లాక్‌ ఇన్‌ పీరియడ్‌ పెంపు: సెబీ

న్యూఢిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) నిధుల వినియోగ నిబంధనలను సెబీ మరింత కట్టుదిట్టం చేసింది. ఐపీఓ నిధులతో ఇతర కంపెనీల కొనుగోళ్ల నిబంధనలను మరింత పటిష్టం చేసింది. ఇక నుంచి కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించే నిధుల్లో 25 శాతానికి మించి, ఆఫర్‌ డాక్యుమెంట్‌లో చెప్పని కంపెనీల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసేందుకు వీలుండదు. కంపెనీల సాధారణ అవసరాల కోసమూ ఐపీఓ నిధుల్లో 10శాతానికి మించి ఖర్చు చేయకుండా ఆంక్షలు విధించింది. వ్యాపార విస్తరణ పేరుతో కంపెనీల అడ్డగోలు కొనుగోళ్లకు చెక్‌ పెట్టేందుకు సెబీ ఈ చర్య తీసు కుంది. కాగా యాంకర్‌ ఇన్వెస్టర్ల అడ్డగోలు లాభాలకు చెక్‌ పెట్టేందుకూ సెబీ చర్యలు తీసుకుంది. ఇక నుంచి వీరు తమ పెట్టుబడుల్లో 50 శాతం మాత్రమే నెల రోజుల తర్వాత అమ్ముకునేందుకు అనుమతిస్తారు. మిగతా 50శాతం షేర్లను అమ్ముకునేందుకు 90 రోజుల వరకు వేచిచూడాల్సిందే. ఈ ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకిరానుంది.

Updated Date - 2022-01-18T10:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising