ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఐసీలో 3.5% వాటా విక్రయం

ABN, First Publish Date - 2022-04-24T06:18:04+05:30

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో 3.5 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.21,000 కోట్ల సమీకరణ లక్ష్యం 


మే మొదటి వారంలో ఐపీఓ

27న సెబీకి ఆర్‌హెచ్‌పీ దాఖలు 

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ ద్వారా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ)లో 3.5 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ ఇష్యూ మార్కెట్లోకి అడుగుపెట్టనుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇష్యూ పరిమాణం రూ.21,000 కోట్ల వరకు ఉండనుందని ఆ అధికారి పేర్కొన్నారు. కంపెనీ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. కాగా ఈ నెల 27న (బుధవారం) మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (ఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేసే అవకాశం ఉందని అ అధికారి తెలిపారు. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ప్రభుత్వం ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించనుందని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా తలెత్తిన ఆటంకాలతో పాటు స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లలో సాగుతుండటంతో ఎల్‌ఐసీ ఐపీఓ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీంతో తొలుత ఎల్‌ఐసీలో 5 శాతం వాటా విక్రయించాలని భావించిన ప్రభుత్వం తాజాగా 3.5 శాతానికి తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం నాడు సెబీకి సమర్పించనున్న ఆర్‌హెచ్‌పీలో పాలసీహోల్డర్లు, ఉద్యోగులకు షేర్ల కేటాయింపు వివరాలు సహా ఇష్యూ ధర, డిస్కౌంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆ ఉన్నతాధికారి తెలిపారు.  

Updated Date - 2022-04-24T06:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising