ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahindra Scorpio Classic : మహింద్రా ‘స్కార్పియో క్లాసిక్’ విడుదల.. లుక్ అదిరింది..

ABN, First Publish Date - 2022-08-20T01:24:49+05:30

కొత్త ‘ 2022 మహింద్రా స్కార్పియో క్లాసిక్’ (2022 Mahindra Scorpio Classic) భారత మార్కెట్‌లో విడుదల చేసినట్టు దేశీయ వాహన తయారీ దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొత్త ‘ 2022 మహింద్రా స్కార్పియో క్లాసిక్’ (2022 Mahindra Scorpio Classic) కారును భారత మార్కెట్‌లో అఫీషియల్‌గా విడుదల చేసినట్టు దేశీయ వాహన తయారీ దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా( Mahindra and  Mahindra) ప్రకటించింది. 2 వేరియెంట్లతో ఏడు/తొమ్మిది సీట్ల లేఅవుట్లతో అందుబాటులోకి వచ్చింది. స్కార్పియో క్లాసిక్-ఎస్ ధర ఎక్స్‌షోరూం రూ.11.99 లక్షలు, క్లాసిక్ ఎస్11 ధర రూ.15.49 లక్షలుగా కంపెనీ పేర్కొంది. కాగా ‘స్కార్పియో-ఎన్’(Scorpio-N)కు ఆధునిక ఫీచర్లు జతచేసి ‘స్కార్పియో క్లాసిక్’(Scorpio Classic)ను మహింద్రా అండ్ మహింద్రా( Mahindra and  Mahindra) మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎంట్రీ స్థాయిలో ‘క్లాసిక్ ఎస్‌’.. కాగా మరిన్ని ఫీచర్లతో ‘క్లాసిక్ ఎస్ 11’ గా తయారుచేసింది.



ఇక కారు ఆధునిక ఫీచర్ల విషయానికి వస్తే.. ఎక్స్‌యూవీ700, స్కార్పియో-ఎన్ మాదిరిగా ‘ట్విన్-పీక్స్’ ఎస్‌యూవీ లోగోతో కారుని తయారు చేశారు. ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇక ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్‌ టాప్ మీద ఎల్ఈడీ డీఆర్ఎల్, డైమండ్-కట్ ఆకృతి కనిపించేలా చక్రాలు ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూస్తే మహింద్రా స్కార్పియో క్లాసిక్‌కి 2 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, ఫ్రంట్ సీటు బెల్ట్ రిమైండర్ ల్యాంప్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్, హైస్పీడ్ అలెర్ట్, పానిక్ బ్రేక్ ఇండికేషన్ ఉన్నాయి.

Updated Date - 2022-08-20T01:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising