‘వే 2 న్యూస్’కు 130 కోట్ల నిధులు
ABN, First Publish Date - 2022-06-10T09:09:24+05:30
హైదరాబాద్‌కు చెందిన ‘వే 2 న్యూస్’కు 16.75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.130 కోట్లు) నిధులు లభించాయి.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన ‘వే 2 న్యూస్’కు 16.75 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.130 కోట్లు) నిధులు లభించాయి. సిరీ్‌స-ఏ శ్రేణి కింద ఈ నిధులను సమీకరించినట్లు వే 2 న్యూస్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజు వనపాల తెలిపారు. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, హైదరాబాద్‌కు చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ శశి రెడ్డి ఈ పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడుల ద్వారా భారత్‌లో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ ప్రవేశించినట్లవుతుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళకు సేవలను విస్తరించడానికి, వినియోగదారులను పెంచుకోవడానికి తాజాగా లభించిన నిధులను వే 2 న్యూస్ వినియోగించుకుంటుంది. యాప్ ద్వారా వే 2 న్యూస్ వార్తలను అందిస్తోంది.
Updated Date - 2022-06-10T09:09:24+05:30 IST