హైదరాబాద్ విమానాశ్రయానికి రూ.1,150 కోట్లు
ABN, First Publish Date - 2022-12-15T01:20:58+05:30
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) సెక్యూర్డ్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ద్వారా నిధుల సమీకరణను పూర్తి చేసింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.1,150 కోట్లను సమీకరించినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. ఈ డిబెంచర్లపై 8.805 శాతం వడ్డీ రేటును చెల్లిస్తారు. సెబీ వద్ద నమోదైన క్యూఐబీలు ఈ ఎన్‌సీడీలను కొనుగోలు చేశారు.
Updated Date - 2022-12-15T01:21:01+05:30 IST