ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లుల కోసం హైకోర్టు మెట్లెక్కిన YSRCP జడ్పీటీసీ

ABN, First Publish Date - 2022-01-09T12:37:30+05:30

బిల్లుల కోసం హైకోర్టు మెట్లెక్కిన YSRCP జడ్పీటీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/ఎర్రావారిపాళెం : గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు సకాలంలో చెల్లించక పోగా కాళ్లు అరిగేలా తిప్పించుకుంటున్నారంటూ అధికార పార్టీ జడ్పీటీసీ ఒకరు హైకోర్టులో కేసు వేశారు. ఎర్రావారిపాళెం జడ్పీటీసీ జంగా కరుణాకర రెడ్డి కాంట్రాక్టర్‌ కూడా. సొంత మండలంలోని యల్లమంద పంచాయతీ చింతలవారిపల్లె వద్ద రెండు కల్వర్టు నిర్మాణాలు, మాలేవాండ్లపల్లె వద్ద ఓ కల్వర్టు పనులు 2021లో చేశానని పిటీషన్‌లో పేర్కొన్నారు. పనుల నెంబర్లు 2021లో సీఎఫ్‌ఎంఎస్‌- 200419తో జరిగిన పని బిల్లు రూ.135293, సీఎఫ్‌ఎంఎస్‌-2205460తో జరిగిన పని బిల్లు రూ194258, సీఎఫ్‌ఎంఎస్‌-220418తో జరిగిన పని బిల్లు రూ.192130, సీఎఫ్‌ఎంఎస్‌- 200417తో జరిగిన పని బిల్లు రూ.192130 ప్రకారం రూ.713811 తనకు రావాల్సివున్నా అధికారులు చెల్లించడం లేదంటూ కోర్టుకెక్కాడు.


సదరు పనులకు నిధులు 14వ ఆర్థిక సంఘం కింద మంజూరైనవేనని తెలియ జేశాడు. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, ఏపీ ప్రధాన కార్యదర్శి, పీఆర్‌ కమిషనర్‌, జేసీ(అభివృద్ధి)తో పాటు, డివిజనల్‌, మండల స్థాయి అధికారులను ప్రతివాదులుగా చేర్చి రిట్‌ పిటీషన్‌ హైకోర్టులో దాఖలు చేశారు. పరిశీలించిన కోర్టు బిల్లులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Updated Date - 2022-01-09T12:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising