ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జులై 8న వైసీపీ ప్లీనరీ.. ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం

ABN, First Publish Date - 2022-03-15T22:44:56+05:30

జులై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహించినున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జులై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. ప్లీనరీ తర్వాతే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  ఏప్రిల్‌ 10 కల్లా గ్రామస్థాయిలో ఉపాధిహామీ సహా అన్ని బిల్లులనూ చెల్లిస్తామన్నారు. నగరాలు, పట్టణాల్లో కూడా బిల్లులు చెల్లిస్తామని, ఉగాదిన వాలంటీర్లకు సన్మానం, అవార్డులు ప్రదానం చేయనున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. 


పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రతినెలా 10 సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. గ్రామాల్లో 20 రోజులపాటు బూత్ కమిటీలు తిరగాలని సూచించారు. ‘‘మీరు గెలవండి.. పార్టీని గెలిపించుకురండి. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఇక ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి వెళ్లే దిశగా అడుగులు వేయాలి. గడపగడపకు వెళ్లడం కన్నా మరే ప్రభావవంతమైన కార్యక్రమం లేదు. కనీసం 3 సార్లు డోర్‌ టూ డోర్ కార్యక్రమం చేపట్టాలి. కొత్త జిల్లాలకు అధ్యక్షులను తీసుకుంటాం. సర్వేల్లో మీ పేరు రాకుంటే మొహమాటం లేకుండా టికెట్ల నిరాకరిస్తాం.’’ అని  ఎమ్మెల్యేలకు జగన్‌ తెలిపారు. 

Updated Date - 2022-03-15T22:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising