ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSR Jagananna Housing Colony: కట్టని ఇళ్లకు కోట్లతో స్వాగతం

ABN, First Publish Date - 2022-12-16T02:42:33+05:30

పేదల ఇళ్లు పూర్తయ్యేందుకు డబ్బులు ఇవ్వడంలేదు కానీ... ఆర్చిల కోసం ప్రభుత్వం అక్షరాలా యాభై కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో మొత్తం 1127 లే-అవుట్ల వద్ద ‘వైఎ్‌సఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీ’ పేరుతోస్వాగత తోరణాలు నిర్మించాలంటూ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ జి.లక్ష్మీషా అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్‌ జారీచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేదింటి గూడు ముందు పేరు కోసం పాకులాట

‘జగనన్న’ పేరుతో స్వాగత తోరణాలు కట్టాలట!

1127 లేఅవుట్ల వద్ద నిర్మాణానికి రూ.50 కోట్లు

చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు

హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ సర్క్యులర్‌

మింగ మెతుకు లేదు... మీసాలకు సంపంగి నూనె! ..సర్కారు వారి చేష్టలకు ఈ సామెత చక్కగా సరిపోతుంది. పేదవాడి చేతికి గూడు అందించి మేలు చేయడంకంటే... పేరు కోసమే పాకులాట అని స్పష్టమై పోయింది. జగనన్న ఇంటి నిర్మాణాలు కుంటి నడకన సాగుతున్నా... పునా దుల దశ దాటకున్నా... బిల్లులు ఇవ్వక పోవడంతో కాంట్రాక్టర్లు కాడి పారేసినా సరే... సర్కారు పట్టించుకోవడంలేదు. కానీ... కనిపించని, పూర్తికాని కాలనీల ముందు ‘ముఖ్యమంత్రి పేరు’తో పెద్ద స్వాగత తోరణాలు (ఆర్చిలు) నిర్మించాలని ఆదేశించింది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్లు పూర్తయ్యేందుకు డబ్బులు ఇవ్వడంలేదు కానీ... ఆర్చిల కోసం ప్రభుత్వం అక్షరాలా యాభై కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో మొత్తం 1127 లే-అవుట్ల వద్ద ‘వైఎ్‌సఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీ’ పేరుతోస్వాగత తోరణాలు నిర్మించాలంటూ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ జి.లక్ష్మీషా అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్‌ జారీచేశారు. ‘‘ఆర్చి నిలువు స్తంభాలకు అందమైన ఆకృతులతో స్టోన్‌ క్లాడింగ్‌ ఉండాలి. ఆరు అడుగుల ఎత్తు వరకు ఆర్నమెంటల్‌ పెయింటింగ్‌తో స్వాగత ద్వారాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు’’ అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. లే-అవుట్ల సైజును బట్టి 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగుల వెడల్పుతో ఆర్చిలను నిర్మించాలని తెలిపారు. రోడ్లు భవనాలశాఖ, పంచాయతీరాజ్‌, గృహనిర్మాణ శాఖల ఆధ్వర్యంలో తక్షణమే ఆర్చిల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సొమ్మొకరిది.. సోకొకరిది అంటే ఇదే

‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అనే సామెత జగన్‌ సర్కారు తీరుకు అతికినట్లుగా సరిపోతుంది. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో దాదాపు 95 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తోంది. రాష్ట్రప్రభుత్వం 5 శాతమే భరిస్తోంది. అదికూడా సక్రమంగా విడుదల చేయకపోవడం వల్లే ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. కానీ... పేదల ఇళ్లను మొత్తం తామే నిర్మిస్తున్నట్లు జగన్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి జగన్‌ పేరుతో భారీ స్వాగత ద్వారాలను ఏర్పాటు చేసుకుంటోంది. పేదలకు నిర్మిస్తున్న ఇళ్లకు మొత్తం రూ. 1,80,000 రాయితీ ఇస్తుండగా.. అందులో కేంద్రం రూ.1,50,000 భరిస్తోంది. మిగిలిన రూ.30వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే గ్రామీణ ఇళ్లకు ఆ నిధులను కూడా రాష్ట్రం ఇవ్వకుండా.. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులను ఇళ్ల లబ్ధిదారులకు లేబర్‌ చార్జీలుగా దారి మళ్లించి ఆ భారాన్ని కూడా తగ్గించేసుకుంది. ఇక అర్బన్‌ పథకంలో నిర్మిస్తున్న ఇళ్లకు రాష్ట్రం ఇవ్వాల్సిన రూ. 30 వేలు ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలోని కేంద్ర మంజూరీ, పర్యవేక్షణ కమిటీ (సీఎ్‌సఎంసీ) గత నెలలో రాష్ట్రానికి వచ్చి పేదల ఇళ్ల నిర్మాణం తీరును పరిశీలించింది. ‘రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) పథకం కింద రాష్ట్రానికి మొత్తం 20 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. వాటిలో నాలుగో వంతే మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయడం లేదు’ అంటూ కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చింది.

ఇదీ ‘ఇంటి’ గుట్టు...

జూ ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్లు నిర్మిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా 15,901 లే-అవుట్లను ఏర్పాటు చేశారు. వాటిలో ఇళ్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఇళ్ల నిర్మాణం ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారింది. నగరాలు, పట్టణాలకు సమీపంలో అక్కడక్కడ నివాసయోగ్యంగా ఉన్న చోట మాత్రమే ‘కాలనీలు’ ఒక రూపు దాల్చుతున్నాయి.

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ) పథకం కింద ఏపీకి కేంద్రం 1,82,632 ఇళ్లను మంజూరు చేయగా.. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఐదు ఇళ్లే పూర్తి చేయగలిగారని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వీనిరంజన్‌ జ్యోతి పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు.

లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న లే-అవుట్లు ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం అనువుగా లేవు.

Updated Date - 2022-12-16T02:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising