ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ntr health university name change: వైఎస్ఆర్ అంటే నాకూ అభిమానమే కానీ..: పురందేశ్వరి

ABN, First Publish Date - 2022-09-22T23:35:56+05:30

హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ (NTR) పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాడాన్ని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ (NTR) పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాడాన్ని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు (NTR family members) ఒక్కొక్కరుగా వ్యతిరేకిస్తున్నారు.  హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. వర్సిటీ పేరును మార్చడం ఎన్టీఆర్‌ను అవమానించడమేనని ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి విమర్శించారు. వర్సిటీ పేరును ఎందుకు మార్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌ అంటే తనకు అభిమానమే కానీ.. ఎన్టీఆర్ పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మహిళల ఆశయాలనూ జగన్ వమ్ము చేశారని తప్పుబట్టారు. మద్య నిషేధం అన్నారు.. ఏరులై పారిస్తున్నారని పురందేశ్వరి (Purandeswari) దుయ్యబట్టారు. 


విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఇన్నాళ్లుగా ఉన్న ‘ఎన్టీఆర్’ పేరును జగన్ సర్కార్ తొలగించడంపై ఆయన మనవడు, ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నొప్పింపక.. తానొప్పక అనే రీతిలో ఉందని నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. నందమూరి కుటుంబంలోని ఇతర కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేసి మరీ ముక్త కంఠంతో ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సుతిమెత్తగా స్పందించారని జూనియర్ ట్వీట్ చూసిన నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


‘NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ అని ఎన్టీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు.


ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నాయకులు ఎక్కడికక్కడ దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ పేరుమార్పు విషయంలో ప్రభుత్వం వెనక్కితగ్గాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మారితే.. పేర్లు మార్చేస్తారా? అని నిలదీస్తున్నారు.

Updated Date - 2022-09-22T23:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising