ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసుకు బ్రేకులేస్తున్నదెవరు?

ABN, First Publish Date - 2022-09-15T01:21:52+05:30

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరగనున్నాయని, ముఖ్యమైన నిందితుల అరెస్టులకు అవకాశముందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/హైదరాబాద్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరగనున్నాయని, ముఖ్యమైన నిందితుల అరెస్టులకు అవకాశముందని తెలిసిన ప్రతిసారీ... సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళతారు! అక్కడ ఏం జరుగుతుందో తెలియదుకానీ... ఇక్కడ సీబీఐ గప్‌చుప్‌ అవుతోంది.


వివేకా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ముఖ్యులు... ముఖ్యమంత్రికి చాలా సన్నిహిత బంధువులు! విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్‌ చేసిన ఆయనే... అధికారంలోకి రాగానే ఆ సంగతి పక్కనపెట్టారు. దీంతో... వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత... ఈ కేసులో సీబీఐ అడుగులు వేగంగా పడి, కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు సిద్ధమైన ప్రతిసారీ సీఎం జగన్‌ ఢిల్లీకి వెళ్లడం రివాజుగా మారింది. అక్కడ ఢిల్లీ పెద్దలతో ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. ఇక్కడ మాత్రం వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు సైలెంట్‌ అయిపోతున్నారు. గత నెలలో అదే జరిగింది. వారంలో కీలక పరిణామాలు జరగనున్నాయని... వివేకా హత్య కేసులో కీలక ప్రజా ప్రతినిధిని అరెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమైందని అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. పులివెందులలో పోలీసు బలగాలు సైతం భారీగా మోహరించాయి. 


అదే సమయంలో... గతనెల 21న ముఖ్యమంత్రి జగన్‌ అకస్మాత్తుగా, ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లారు. 22న ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు. అంతే... ఇక్కడ సీబీఐ గప్‌చుప్‌ అయిపోయింది. 


ఈ నేపథ్యంలో  ‘‘వివేకా హత్య కేసుకు బ్రేకులేస్తున్నదెవరు?. సీబీఐ ఒక్క అడుగు వేయగానే జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు?. జగన్ ఢిల్లీ వెళ్లగానే సీబీఐ చేతులు కట్టేస్తుంది ఎవరు?. సీబీఐపై కేసులు పెడుతూ ఎదురుదాడి చేస్తుంది ఎవరు?.ఇలాగైతే విచారణ ముందుకు సాగదని సీబీఐ ఎందుకు అంటోంది?. వివేకా హత్య కేసులో హంతకులదే పై చేయి అవుతోందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-09-15T01:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising