ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ys Vivekananda Reddy Murder Case: మళ్లీ సీబీఐ దూకుడు

ABN, First Publish Date - 2022-07-31T23:04:45+05:30

తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన వైఎస్ వివేకానందారెడ్డి (Ys Vivikananda Reddy) హత్య కేసు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (Kadapa): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందారెడ్డి (Ys Vivekananda Reddy) హత్య కేసు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వివేకా హత్య కేసు విచారణకు సీబీఐ (Cbi) అధికారుల బృందం మరోసారి కడప జిల్లాకు రానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. విచారణ చివర దశలో ఫైనల్ టార్గెట్ ఎవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


వివేకా హత్య కేసులో సీబీఐ ఇప్పటికే స్పీడుగా విచారణ జరపడం ప్రధాన నిందితులను జైలుకు పంపడం జరిగింది. ఏ1గా ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy), ఏ2గా సునీల్ కుమార్ యాదవ్ (Sunil Kumar Yadav),  ఏ3గా ఉమా శంకర్ (Uma Shankar), ఏ4గా దస్తగిరి (Dastagiri), ఏ5గా డి. శివ శంకర్ రెడ్డి (Shiva Shankar Reddy)పై ఛార్జిషీటు దాఖలు చేసింది. 


అయితే సీబీఐ విచారణకు అడ్డంకులు కలిగించేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు సీబీఐ అధికారులకు ఇబ్బందులు కలిగించారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కారణాలు ఏవైనా వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల బృందం విచారణ ఆపేసి  వెళ్లిపోయింది. 


ఇక వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Mp Ys Avinash Reddy)ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందంటూ కొద్ది రోజులు హడావుడి జరిగింది.అయితే రాష్ట్రపతి ఎన్నికల (Presidential Elections) నేపథ్యంలో విచారణను కొంతకాలం ఆపాలని అంటూ ఢిల్లీ బీజేపీ (Bjp) పెద్దలు సీబీఐని కోరినట్టుగా ఒక టాక్ కూడా నడిచింది. 


మరి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ముగియడంతో మళ్లీ సీబీఐ ఇప్పుడు వివేకా హత్యపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పలువురు వైసీపీ నేతల్లో హై టెన్షన్ మొదలైందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. 


ఇక ఈ కేసుపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (Tdp Mlc Btech Ravi) మీడియా సమావేశాల్లో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. బీటెక్ రవి ఇటీవల ఢిల్లీ (Delhi) వెళ్లి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు (Ycp Mp RaghuRamaRaju)ను కలిసి ఈ కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పలువురు వైసీపీ నేతలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న టాక్ నడుస్తోంది. 


Updated Date - 2022-07-31T23:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising