ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ వివేకా హత్యతో నష్టపోయిందెవరు?.. సజ్జల అలా ఎందుకన్నారు?

ABN, First Publish Date - 2022-02-17T01:18:08+05:30

వైఎస్ వివేకానందరెడ్డి హత్య గత ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య గత ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైఎస్ వివేకా హత్యపై రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్షంలో ఉన్న జగన్.. అప్పటి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ నెమ్మదిగా సాగినట్లు కనిపించింది. వివేకానందరెడ్డి కూతురి పోరాటంతో ఆ కేసును హైకోర్టు సీబీఐకు అప్పగించింది. దీంతో సీబీఐ అధికారులు అనేక కోణాల్లో విచారణ జరిపి వివేకా డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నిందితులను గుర్తించింది. ప్రస్తుతం ఈ  కేసు కోర్టులో విచారణ కొనసాగుతోంది.


తాజాగా వివేకానందరెడ్డిని హత్య చేశారని, ఇందుకు కోసం సుపారీ ఇచ్చారని పలువురి నేతల హస్తం ఉందని వివేకా డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కోర్టులో సీబీఐ తన వాదనలు వినిపించింది. అయితే ఈ కేసులో వైసీపీ చెందిన కొందరిని కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామచంద్రారెడ్డి మాత్రం సీబీఐపై ఎదురుదాడికి దిగారు. సీబీఐ చార్జిషీట్ అంతా తప్పుల తడక అని ఆయన కొట్టిపారేశారు. 



ఈ నేపథ్యంలో ‘‘వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో నష్టపోయిందెవరు?. మేమే బాధితులం అని సజ్జల ఎందుకు వాపోతున్నారు?. సీబీఐది అబద్ధాల చార్జిషీట్ అని సజ్జల ఎలా చెప్తారు?. జగన్ అండ్ కోను కూడా కేసులో చేర్చాలని టీడీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 





Updated Date - 2022-02-17T01:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising