ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం: వివేకా కేసుపై సుప్రీం

ABN, First Publish Date - 2022-11-29T11:16:01+05:30

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. తన తండ్రి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్ 19న జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ ముగించింది. ఈ క్రమంలోనే నేడు కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె, భార్యకు కేసు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు సుప్రీం తెలిపింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-11-29T12:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising