ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరే పెద్ద అవినీతి రాజు!

ABN, First Publish Date - 2022-08-04T08:19:52+05:30

మీరే పెద్ద అవినీతి రాజు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఆర్‌ ముఖ్య కార్యదర్శి ద్వివేది ట్వీట్‌ బూమెరాంగ్‌ 

వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డ నెటిజన్లు


అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కా ర్యాలయాల్లో అవినీతిపై టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయండంటూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పెట్టిన ట్వీట్‌ బూమెరాంగ్‌ అయింది. నెటిజన్ల నుంచి ప్రభుత్వం తీ వ్ర విమర్శలను ఎదుర్కొంది. ‘లంచం అడిగితే ఏసీబీ కి ఫోన్‌ చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ని నిర్మూలించడంలో ప్రజలు భాగస్వామ్యం కావాల ని విజ్ఞప్తి. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చే స్తే సమాచారం అందించాల’ంటూ టోల్‌ఫ్రీ నంబర్‌ ను ద్వివేది ట్వీట్‌ చేశారు. నెటిజన్ల నుంచి ఆయన ఏం ఆశించిఈ ట్వీట్‌ పెట్టారో గాని 287 మంది ఆయనకు రీట్వీట్‌ చేశారు. అందులో 90ు మంది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ‘మీరు చేయమన్నట్లు చేస్తే స్థానికంగా నాయకుల నుంచి బెదిరింపులు ఎదురవుతాయి. దాని నుంచి కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్తే కూడా బాగుంటుంద’ని ఓ నెటిజన్‌ సలహా ఇచ్చారు. ‘ఇప్పుడు ఎవరు డైరెక్ట్‌గా లంచం తీసుకుంటున్నారు సార్‌.. రిజిస్ట్రేషన్‌ ఆఫీ్‌సలో లంచం తీసుకోని రిజిస్ట్రార్‌ ఉన్నా డా?’ అని ప్రశ్నించారు. ‘జీఓలు పబ్లిక్‌గ్గా పెడితే ఎవ రు, ఎక్కడ, ఎలా ఖజానా డబ్బులు నొక్కేస్తున్నారో తెలుస్తుంది. జీఓలు లేపేసి, ఇక్కడో నంబర్‌ పెట్టి చిన్న చిన్న పిత్త పురుగుల్ని మాత్రమే పట్టుకుంటూ పోతే అవినీతి పోతుందా? సార్‌’ అంటూ మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ‘ముందు జీఓలు ఆన్‌లైన్‌లో పెట్టండి. ఎన్నికలప్పుడు నీ స్వామి భక్తి అర్థమైంది. అవినీతిలో కూరుకుపోయిన మీరు ఇలాంటివి చెప్తుం టే జనం నవ్వుకుంటారు సార్‌’ అంటూ మరో నెటిజ న్‌ చురకంటించారు. ‘ఫిర్యాదుదారుల సమాచారాన్ని మీరు గోప్యంగా ఉంచడం లేదు. మీరు మా సమాచారాన్ని ఎలా గుట్టుగా ఉంచుతారని నమ్మగలమ’ంటూ మరోకరు ట్వీట్‌ చేశారు. ‘మీరే పెద్ద అవినీతి రాజు.. మీరా ఇలా ట్వీట్‌ చేయడం.. నవ్వొస్తుంద’ంటూ మరొకరు ఎద్దేవా చేశారు. 


Updated Date - 2022-08-04T08:19:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising