ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ దగ్గర అధికారం ఉంటే.. మా దగ్గర కత్తెర ఉంది: వైసీపీ నేతలకు అనిత స్ట్రాంగ్ కౌంటర్

ABN, First Publish Date - 2022-01-06T20:38:32+05:30

చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బూతులు మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ నేతల నోటికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. పొలిటికల్ రౌడీల్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. తాజాగా చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బూతులు మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక కోస్తామని టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు.


ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శిస్తూ బూతులు  మాట్లాడారు. రింగురోడ్డుకు సంబంధించిన అంశంపై స్పందించిన సజ్జల ‘నీ యక్క’ అంటూ బూతు పురాణం అందుకున్నారు. సజ్జల బూతు కామెంట్లు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో దుమారం రేపుతున్నాయి. నీ యక్క అంటూ బూతులు మాట్లాడిన సజ్జలపై టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత కన్నెర్ర చేశారు. ‘మీకు బూతులు వస్తే.. మాకు నాలుక కత్తిరించడం వచ్చు’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై టీడీపీ నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక బూతులు తిడతారా అంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల బూతులు వింటుంటే ఆ పార్టీని వైసీపీ బూతుల పార్టీగా మార్చుకోవాలని సూచించారు. వైసీపీ బూతుల స్కూల్ ప్రిన్సిపాల్‌గా  సజ్జల రామకృష్ణారెడ్డిని నియమిస్తే కరెక్ట్‌గా సరిపోతుందంటూ ఆమె సెటైర్లు వేశారు. 


సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ నేత పట్టాభిరామ్ హెచ్చరించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నడిరోడ్డు మీద నిలబెడతామన్నారు. మద్యం షాపుల్లో క్యాష్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సాయంత్రానికి నల్లడబ్బు కంటైనర్లలో తాడేపల్లికి చేరుతోందని ఆరోపించారు. జేపీ వెంచర్ పేరుతో ఇసుక రీచ్‌లను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మత్తు పదార్థాలు ఎక్కడ పట్టుబడ్డా మూలాలు ఏపీ అని తేలుతోందన్నారు. మారిటైం బోర్డులోని రూ.1200 కోట్లను దారి మళ్లించారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-06T20:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising