ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సర్పంచ్‌పై వైసీపీ మద్దతుదారుల దాడి

ABN, First Publish Date - 2022-08-04T07:56:47+05:30

మహిళా సర్పంచ్‌పై వైసీపీ మద్దతుదారుల దాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంపుతామని బెదిరింపులు.. భూ వివాదమే కారణం

పూసపాటిరేగ, ఆగస్టు 3: ఓ భూ వివాదానికి సంబంధించి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపల్లి పంచాయతీకి చెందిన టీడీపీ మద్దతు మహిళా సర్పంచ్‌ లంకలపల్లి గాయత్రిపై వైసీపీకి చెందిన వారు బుధవారం దాడి చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. గాయత్రి భర్త లంకలపల్లి శ్రీనివాసరావు గతంలో గ్రామంలోని సర్వే నెంబరు 10(36)లో కొంత భూమిని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నారు. ఆ భూమి ఇంటికి దగ్గరగా ఉండటంతో రేకులషెడ్‌ వేసుకొన్నారు. కాగా ఈ భూమి తమ తాతలు ఇచ్చారని, తమ వద్ద 1932 సంవత్సరానికి చెందిన రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ ఉందని, ఆ భూమి తమదని కొంతకాలంగా వైసీపీకి చెందినవారు చెబుతున్నారు. కొద్దిరోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా వైసీపీకి చెందినవారు బుధవారం రేకుల షెడ్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. సర్పంచ్‌ గాయత్రి అడ్డుకున్నారు. ఆమెపై వైసీపీ నాయకులు దాడిచేశారు. చంపుతామని బెదిరించారని ఆమె తెలిపారు. పోలీసులతో పాటు విజయనగరం దిశా పోలీ్‌సస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-08-04T07:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising