ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలి, జగన్‌.. కేసులు సేమ్‌ టు సేమ్‌!

ABN, First Publish Date - 2022-10-01T09:10:41+05:30

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి కేసులకు, సీఎం జగన్‌ మీద ఉన్న కేసులకు పెద్ద తేడా లేదని, సేమ్‌ టు సేమేనని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దసరా తర్వాత జగన్‌ కేసులపై రోజు వారీ విచారణ ప్రారంభమైతే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజు వారీ విచారణ చేపడితే సీఎం హాజరు కాకుండా తప్పించుకోలేరు

మంత్రులూ.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి

అమరావతి రైతులను కించపరచొద్దు: రఘురామ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి కేసులకు, సీఎం జగన్‌ మీద ఉన్న కేసులకు పెద్ద తేడా లేదని, సేమ్‌ టు సేమేనని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దసరా తర్వాత జగన్‌ కేసులపై రోజు వారీ విచారణ ప్రారంభమైతే ఆయన కోర్టుకు హాజరు కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్డర్‌ కూడా పనిచేయదన్నారు. ఇక, జగన్‌ తప్పించుకునే అవకాశమే లేదన్నారు. కాగా, రాజధాని రైతులపై మంత్రులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే ప్రజలు తిప్పికొడతారని రఘురామ హెచ్చరించారు. అమరావతి మహిళా రైతులు కాళ్లు కందిపోయేలా పాదయాత్ర చేస్తుంటే కొంతమంది మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విరుచుకపడ్డారు. కొంతమంది తమను కాళ్లు విరగ్గొడతామని బెదిరిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి పేర్కొన్న విషయాన్ని రఘురామ ప్రస్తావించారు.




శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక పేరిట మూడు రాజధానులు కావాలని, లేకపోతే మూడు రాష్ర్టాలను ఏర్పాటు చేయాలంటూ ఓ వార్తను జగన్‌ సొంత దినపత్రిక మొదటి పేజీలో ప్రచురించారంటేనే ఆ వేదిక వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. రుషికొండపై సీఎం జగన్‌ నివాసాన్ని, కార్యాలయాన్ని నిర్మించుకోవద్దా? అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు పరిశీలిేస్త, రుషికొండకు గుండు కొట్టి జగన్‌ నివాసం, కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. కాగా, విశాఖ భూకుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని రఘురామ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం జగన్‌ సముచిత గౌరవం ఇవ్వాలని రఘురామ సూచించారు. కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోతే వారు తిరుగుబాటు చేేస ప్రమాదముందని హెచ్చరించారు.  మరోవైపు దివంగత కృష్ణంరాజు కుటుంబానికి సీఎం జగన్‌ అండగా ఉంటార వ్యాఖ్యానించడం వెనుక క్షత్రియుల ఓట్లు గంపగుత్తగా వస్తాయన్న రాజకీయ ఎత్తుగడ ఉందన్నారు. 

Updated Date - 2022-10-01T09:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising