ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా jagan

ABN, First Publish Date - 2022-07-09T20:35:48+05:30

వైసీపీ ప్లీనరీ (YCP Plenary) సమావేశాలు రెండో రోజు కూడా అట్టహానం నిర్వహించారు. రోజు తొలి రోజు ప్రతినిధుల సభ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ ప్లీనరీ (YCP Plenary) సమావేశాలు రెండో రోజు కూడా అట్టహానం నిర్వహించారు. తొలి రోజు ప్రతినిధుల సభ.. రెండో రోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. హామీల అమలు, నవరత్నాలు, మహిళా సాధికారత, వివిధ రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులపై చర్చించారు. రెండో రోజు పలు తీర్మానాలు చేశారు. వైసీపీ జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్‌‌ (CM jagan) ను ప్రతినిధులు ఎన్నుకున్నారు. ప్లీనరీలో ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆమోదించారు. ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభతో జగన్ మాట్లాడారు. ‘‘ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోంది. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌, టీడీపీ (TDP) కలిసి నాపై కేసులు పెట్టారు. శక్తివంతమైన వ్యవస్థలతో నాపై దాడి చేయించారు. మనకు అన్యాయం చేసిన పార్టీల ప్రస్తుత పరిస్థితి ఏమిటి?.. 2014లో ఒక శాతం ఓట్ల తేడాతో ఓడి ప్రతిపక్షంలో కూర్చున్నాం. 2014లో ఓడినా నాపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదు. 25 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొన్నారు. వైసీపీ ఉండకూడదని ఎన్నో కుయుక్తులు చేశారు. మన వద్ద ఎన్ని కొన్నారో వాళ్లకు అన్ని సీట్లే వచ్చాయి’’ అని జగన్‌ గుర్తుచేశారు.



మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం నెరవేరుస్తున్నామని జగన్ ప్రకటించారు. మూడేళ్లలో మంచి పాలన అందించడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఇతర పార్టీల నేతలను లాక్కోవడంపై దృష్టి పెట్టలేదని వివరించారు. నాయకుడిని, పార్టీ నడిపించేవి.. క్యారెక్టర్‌, క్రెడిబులిటీ మాత్రమేనని తెలిపారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసేందుకే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పనులు చేయాలనే ఆలోచన టీడీపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసే చిప్‌.. గుండెలో ఉండాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు పదవిపైనే వ్యామోహముందని విమర్శించారు. కుప్పంకు రెవెన్యూ డివిజన్‌ ఇవ్వాలని చంద్రబాబు అర్జీ పెట్టుకున్నారని జగన్ తెలిపారు.




Updated Date - 2022-07-09T20:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising