ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వంలో అంతా అరాచకమే: పీతల సుజాత

ABN, First Publish Date - 2022-06-21T00:39:24+05:30

వైసీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకానికి పాల్పడుతోందని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: వైసీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకానికి పాల్పడుతోందని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో వైసీపీ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్ భయపడి.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు ఇళ్లపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై దాడిని సుజాత ఖండించారు. అధికారులు, రాజకీయ నాయకుల కోసం కాకుండా రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని, లేకపోతే భవిష్యత్తులో వైసీపీతో పాటు అధికారులు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సుజాత హెచ్చరించారు. 


రాష్ట్రంలో బుల్‌డోజర్‌ రాజకీయం తెరమీదికి వచ్చింది. రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ సర్కారుపై తరచుగా విమర్శలు చేస్తున్న టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున జేసీబీతో అధికారులు విరుచుకుపడ్డారు. పంట కాలువ గట్టును రెండు సెంట్ల మేర ఆక్రమించుకున్నారనే అభియోగంపై అయ్యన్న ఇంటి వెనుక ఉన్న ప్రహరీని కూల్చేశారు. అదేవిధంగా వంట గదిని కూలగొట్టేందుకు సిద్ధం కావడంతో అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.


Updated Date - 2022-06-21T00:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising