ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul ఈడీ విచారణ... కేంద్రం కక్ష సాధించట్లేదన్న Vijayasaireddy

ABN, First Publish Date - 2022-06-15T17:24:13+05:30

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ విచారణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ఈడీ విచారణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(vijayasai reddy) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘కర్మ సిద్ధాంతంతో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందే’’ అని అన్నారు. కేంద్రం కక్ష సాధింపు చేయట్లేదని స్పష్టం చేశారు. సుబ్రమణ్య స్వామి వేసిన పిల్‌పైనే విచారణ జరుగుతోందని.. రాజకీయాలు ఆపాదించడం తగదంటూ బీజేపీకి మద్దతుగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. 


మరోవైపు నేషనల్ హెరాల్డ్ మనీ-లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీ వరుసగా మూడో రోజు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో దాదాపు 20 గంటల పాటు రాహుల్‌ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ స్టేట్మెంట్‌ను ఈడీ రికార్డు చేస్తోంది. కాగా... రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆర్ధిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల గురించి సరైన సమాధానాలు రాహుల్ ఇవ్వడం లేదని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాహుల్కు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గర 144 సెక్షన్‌ను విధించారు.

Updated Date - 2022-06-15T17:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising