ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయం లేకుంటే జీతాలు ఇవ్వారా?.. నిలదీసిన రఘురామ

ABN, First Publish Date - 2022-01-20T00:38:47+05:30

ఏపీ ఉద్యోగుల పీఆర్సీపై ఎంపీ రాఘరామకృష్టంరాజు చేపట్టిన ఉపవాస దీక్ష ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన దీక్ష చేశారు. ఈ దీక్ష ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీ ఉద్యోగుల పీఆర్సీపై ఎంపీ రాఘరామకృష్టంరాజు చేపట్టిన ఉపవాస దీక్ష ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన దీక్ష చేశారు. ఈ దీక్ష ముగిసిన సందర్భంగా రఘురామరాజు మాట్లాడుతూ ‘‘ ప్రభుత్వ టీచర్లకు అన్యాయం చేయొద్దు అంటూ జగన్ రెడ్డి‌కి విద్యార్థులు లేఖలు రాయండి. మీ నిరసనను ఏదోరకంగా తెలుపుతూ సీఎం జగన్‌కి లేఖలు రాయండి. ఉద్యోగుల కష్టాల గురించి చులకనగా మాట్లాడొద్దు. ఉద్యోగులకు చీఫ్ సెక్రటరీ ఏమైనా రిలీఫ్ ఇస్తారేమో అనుకున్నా. కోవిడ్‌తో అభివృద్ధి లేక ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయని అంటున్నారు. మిగతా రాష్ట్రాలకు రాలేదా?. ఆదాయం లేకుంటే జీతాలు ఇవ్వరా?. 80 ఏళ్ల తర్వాత పెన్షన్ వస్తే ఉద్యోగి బతికి ఉండాలి కదా?. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్టానికి సహాయం అందించింది. అశుతోష్ మిశ్రా రిపోర్ట్ బయటపెట్టాలి. ఉద్యోగులకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలి. వారి సమస్యలు పరిష్కారించాలి. ముఖ్యమంత్రి మనసు కరగాలి. సలహాదారులను పక్కన పెట్టి ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి. ముఖ్యమంత్రికి శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నా. ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలి.’’ అని రఘురామకృష్ణంరాజు సూచించారు. 



Updated Date - 2022-01-20T00:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising