ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్ముంటే నాపై పోటీకి రా... Chandrababuకు కొడాలి నాని సవాల్

ABN, First Publish Date - 2022-06-28T20:26:14+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)కు మాజీ మంత్రి కొడాలి నాని(Kodali nani) సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని చాలెంజ్ చేశారు. కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు నన్ను ఓడించడం కాదు.. 2024లో కుప్పంలో గెలవాలి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతన్ని నమ్ముకున్న దత్తపుత్రుడిని తుక్కుతుక్కు కింద ఓడిస్తాం. 2024, 29 ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తా, గుడివాడలోనే చస్తాను. పుట్టిన ఊరు వదిలి పారిపోయిన చంద్రబాబు ఓ నాయకుడా. ఎన్టీఆర్‌ను చంపిన చంద్రబాబు నిమ్మకూరులో బసచేస్తే ఆయన ఆత్మ క్షోబిస్తుంది. కుటుంబ పెద్ద లాంటి వైఎస్ఆర్ లేకపోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలైంది. జగన్‌కు అడ్డంగా నిలబడ్డ తమను దాటుకొని చంద్రబాబు, దత్తపుత్రుడు ముందుకు వెళ్లాలి. తిరుపతి ప్రజల చిత్కాకారానికి గురయ్యామన్న భయంతోనే ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయలేదు. ఎన్టీఆర్ వారసుడు మాదిరిగా జగన్ పని చేస్తున్నాడు’’ అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. 


వైసీపీ ప్లనరీలో మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ప్లీనరీ పరిశీలకులు బూరగడ్డ రమేష్ నాయుడు, వైసీపీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 25 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎంత మంది కలిసి పోటీ చేసిన జగన్‌ను ఏమీ చేయలేరన్నారు. నిమ్మకూరు ప్రజలు తమ ఊరు రావద్దని చంద్రబాబుకు చెప్పాలని అన్నారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డ అని స్పష్టం చేశారు. 


మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ...  తెలుగుదేశం పార్టీ మాదిరే గుడివాడలో జరగనున్న టీడీపీ మహానాడు రొచ్చు రొచ్చు అయిందన్నారు. కొడాలి నానిని ఓడించే సంగతి మరిచి, గుడివాడలో టీడీపీ అభ్యర్థిని సిద్ధం చేసుకోవాలని హితవుపలికారు. 


Updated Date - 2022-06-28T20:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising