ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Mutyalanaidu ఇలాకలో చెప్పులతో కొట్టుకుంటున్న గిరిజనులు

ABN, First Publish Date - 2022-07-08T03:47:00+05:30

మౌలిక సదుపాయాలు కల్పించలేని వైసీపీ ప్రభుత్వం (Ycp Government) ఓట్లు వేసినందుకు చెప్పులతో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి: మౌలిక సదుపాయాలు కల్పించలేని వైసీపీ ప్రభుత్వం (Ycp Government) ఓట్లు వేసినందుకు చెప్పులతో కొట్టుకుని గిరిజనులు నిరసన తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం (Ap Deputy Cm) ఇలాకా రోడ్డు వసతిలేకపోవడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. 


రోడ్డు సౌకర్యం లేకపోవడంతో...

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలో గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి ముత్యాల నాయుడు (Minister Mutyalanaidu) సొంత నియోజకవర్గం మాడుగుల. గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చి గెలిచారు. తీరా ఇప్పుడు మంత్రి పదవి వచ్చాక కూడా తమ గురించి పట్టించుకోవడంలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


సమస్యలు పట్టించుకోవడంలేదని..

ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. పద్నాలుగు కిలో మీటర్లు పాదయాత్ర చేసి అధికారులకు విజ్ఞప్తి చేసినా సమస్యల్ని పట్టించుకోవడంలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ముత్యాలనాయుడును గెలిపించి తప్పు చేశామని చెప్పులతో కొట్టుకుని నిరసన తెలిపారు. ఇకనైనా మంత్రి స్పందించాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 



Updated Date - 2022-07-08T03:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising