ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కేంద్రానికి టీడీపీ నేత యనమల లేఖ

ABN, First Publish Date - 2022-09-01T20:07:19+05:30

కేంద్రానికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ (Letter) రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): కేంద్రానికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) లేఖ (Letter) రాశారు. కాకినాడ సెజ్‌ (Kakinada Sej)లో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ (Bulk Drug Park) వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆయన ఫిర్యాదు చేశారు. ప్రతిపాదనను తక్షణమే  విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాశారు. లేఖ ప్రతులను జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపారు. బహుళ-ఉత్పత్తి, ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాజెక్ట్ అమలు ప్రయోజనం కోసం రైతుల నుంచి ప్రభుత్వం 8,500 ఎకరాల భూమిని సేకరించిందన్నారు. ఇక్కడ జరిగే పరిశ్రమల ఏర్పాటు వల్ల మత్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు వైఎస్సార్ హామీ ఇచ్చారన్నారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరబిందో రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ ( ARIPL)కు ఫార్మా పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నారన్నారు. ఫార్మా పార్క్ ఏర్పాటు వల్ల మత్స్యకారులు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని, నీరు, నేల, వాయు, సముద్రం కాలుష్యమై రైతుల, మత్యకారుల జీవనోపాధికి హానికరమన్నారు. ఫార్మా పరిశ్రమ ప్రతికూల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. రైతులు, మత్స్యకారులు  ప్రజలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-09-01T20:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising