yanamala: అవినీతి వద్దని అవినీతిపరుడు చెప్పడం ఏమిటి?
ABN, First Publish Date - 2022-12-16T00:22:55+05:30
‘‘వైసీపీ ప్రభుత్వం కామెడీలో చార్లీ చాప్లిన్‌ను మించిపోతోంది. అవినీతి జోలికి పోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి హితబోధ చేస్తున్నారు.
కామెడీలో చార్లీ చాప్లిన్‌ను మించిపోతున్నారు: యనమల
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ ప్రభుత్వం కామెడీలో చార్లీ చాప్లిన్‌ను మించిపోతోంది. అవినీతి జోలికి పోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి హితబోధ చేస్తున్నారు. అవినీతి వద్దని అవినీతిపరుడు చెప్పడం ఏమిటి? రూ.43 వేల కోట్ల ప్రజా ధనం దోపిడీ కేసుల్లో 24 సీబీఐ, ఈడీ చార్జిషీట్లు వేయించుకొని 16 నెలలు జైల్లో ఉండివచ్చిన జగన్‌రెడ్డి అవినీతిపై హితోక్తులు చెప్పడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు అవినీతి వద్దంటున్నారని అంటే గత 42 నెలలుగా అవినీతి చేసుకోవచ్చని అధికారికంగా అనుమతి ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
Updated Date - 2022-12-16T00:22:56+05:30 IST