నైజీరియా, జింబాబ్వే కంటే దారుణం
ABN, First Publish Date - 2022-10-07T08:23:15+05:30
నైజీరియా, జింబాబ్వే కంటే దారుణం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై యనమల
అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): ‘‘మూడున్నరేళ్ల పాలనలో జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అభివృద్ధిని అటకెక్కికించారు. ప్రజలపై భారాలు, నిలిచిపోయిన అభివృద్ధితో నైజీరియా, జింబాబ్వే కంటే దారుణంగా ఏపీ తయారవుతోంది’’ అని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఓ ప్రకటన చేశారు. తాజాగా కాగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వ అప్పులు అసాధారణంగా పెరిగాయని, మూలధన వ్యయం మాత్రం దారుణంగా తగ్గిపోయిందని అన్నారు. మూడున్నరేళ్లలో రూ.8 లక్షల కోట్ల వరకు అప్పులు చేసినా అభివృద్ధి జరగలేదని, ప్రజల ఆదాయం పెరగలేదని విమర్శించారు.
Updated Date - 2022-10-07T08:23:15+05:30 IST