ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీతి ఆయోగ్‌ భేటీలో హోదా ప్రస్తావనేదీ?

ABN, First Publish Date - 2022-08-08T07:43:41+05:30

నీతి ఆయోగ్‌ భేటీలో హోదా ప్రస్తావనేదీ?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభజన హామీల అమలూ కోరలేదు

పోలవరం నిధులూ అడగని జగన్‌

తమ డిమాండ్లను ప్రముఖంగా ప్రస్తావించిన ఇతర సీఎంలు


న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల సమస్యలను గట్టిగా ప్రస్తావించారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్‌ సమస్యలేవీ లేవనెత్తలేదు. ప్రత్యేక హోదాను ప్రస్తావించలేదు. విభజన హామీల అమలు ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్రానికి రావలసిన నిధుల గురించీ అడగలేదు. రాష్ట్రాలకు జీఎ్‌సటీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ డిమాండ్‌ చేయగా.. కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు అంబుడ్స్‌మన్‌ తరహా పాత్రను నీతి ఆయోగ్‌ నిర్వహించాలని ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సూచించారు. జగన్‌ ఇలాంటివి కూడా మాట్లాడలేదు. పైగా రాష్ట్రంలో తాను అమలు చేస్తున్న అమ్మ ఒడి వంటి ఉచితాల గురించి ఏకరువు పెట్టారు. గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఎజెండాలో చేర్చిన జాతీయ విద్యావిధానంలోనే మాతృభాషలో విద్యాబోధన చేయాలని సూచించినప్పటికీ జగన్‌ తన ప్రసంగంలో ఆ విషయం ప్రస్తావించకపోవడం గమనార్హం. సమావేశం సందర్భంగా ఒక్కో ముఖ్యమంత్రిని పలకరించినట్లే జగన్‌ను కూడా ప్రధాని కొన్ని క్షణాలపాటు పలకరించారు.


జగన్‌కు ముఖం చాటేసిన ఎంపీ మాధవ్‌ 

నగ్న వీడియోతో వివాదంలో చిక్కుకున్న వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆదివారం ఢిల్లీలో సీఎం జగన్‌ను కలవకుండా ముఖం చాటేశారు. తనకు కన పడకూడదని ముఖ్యమంత్రి చెప్పినందునే ఆయన రాలేదని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఉదయం నీతి ఆయోగ్‌ సమావేశానికి జగన్‌ వెళ్లే ముందు ఢిల్లీలోని ఆయన నివాస ద్వారం ముందు వైసీపీలంతా ఆయన్ను కలిశారు. గోరంట్ల మాధవ్‌ విషయంలో ఏ చర్య తీసుకోవాలన్న దానిపై అంతర్గతంగా చర్చ జరుగుతోందని ఒక ఎంపీ ఆ తర్వాత చెప్పారు. సంబంధిత మహిళ నుంచి ఫిర్యాదు రానందున చర్య తీసుకోకపోవచ్చని మరో ఎంపీ అభిప్రాయపడ్డారు. అది నైతికపరమైన అంశమని, గతంలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ వీడియో బయటపడినప్పుడు ఆయన్ను ఆ పార్టీ అధిష్ఠానం తప్పించిందని ఇంకో ఎంపీ గుర్తుచేశారు. ‘జరిగింది చాలా ఘోరం. మాధవ్‌ గురించి అందరికీ తెలుసు. వీడియో మార్ఫింగ్‌ జరిగిందని మాలో చాలా మందిమి అనుకోవడం లేదు’ అని ఆయన అన్నారు.

Updated Date - 2022-08-08T07:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising