ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీటి ప్రాజెక్టుల సంగతేంటి?: విష్ణువర్ధన్‌

ABN, First Publish Date - 2022-08-04T09:16:43+05:30

సాగునీటి ప్రాజెక్టుల సంగతేంటి?: విష్ణువర్ధన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌)/పుంగనూరు, ఆగస్టు 3: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టుపై చర్చపెడుతున్నారే తప్ప, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎంగానీ, మంత్రులు కానీ ఒక్క రోజైనా స్పందించారా? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. యువ సంఘర్షణ యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాకు వచ్చిన ఆయన బుధవారం వైపీసీ విధానాలను ఎండగట్టారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను..’ అంటున్న సీఎం జగన్‌.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఏం విన్నాడు, ఏం చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం పోలవరం కాంట్రాక్టర్లను మారుస్తున్న ప్రభుత్వానికి దానిపై మాట్లాడే హక్కు లేదన్నారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి బార్‌లైసెన్స్‌లు ఇచ్చి దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం లేవని, జగన్‌ రాజ్యాంగం, వైసీపీ సెక్షన్లే అమలవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌ నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరులో మండిపడ్డారు. 

Updated Date - 2022-08-04T09:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising