ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యానం వికసించేనా !

ABN, First Publish Date - 2022-12-16T00:08:28+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరచింది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయంపై దృష్టి పెట్టింది. మూడున్నరేళ్ల తర్వాత పాలకవర్గాన్ని (బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) నియమిస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. పాలకవర్గ సభ్యులను రాష్ట్ర గవర్నర్‌ నామినేట్‌ చేశారు.

వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయానికి కొత్త పాలకవర్గం

నోటిఫికేషన్‌ జారీ ...మూడున్నరేళ్ల తర్వాత కళ్లు తెరిచిన ప్రభుత్వం

సభ్యుల ముందు సవాళ్లెన్నో

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కళ్లు తెరచింది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయంపై దృష్టి పెట్టింది. మూడున్నరేళ్ల తర్వాత పాలకవర్గాన్ని (బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) నియమిస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. పాలకవర్గ సభ్యులను రాష్ట్ర గవర్నర్‌ నామినేట్‌ చేశారు. ప్రజాప్రతినిధులు, ఉద్యాన విశ్వ విద్యాలయ అకడమిక్‌ కౌన్సిల్‌ సభ్యులు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రతినిధులకు పాలకవర్గంలో చోటు లభించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి తరపున పాలకవర్గంలో ఒక ప్రతినిధిని ప్రతిపాదించాల్సి ఉంది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ వైఎన్‌ రెడ్డికి చోటు కల్పించారు. ఉద్యాన విశ్వవిద్యాలయ అకడమిక్‌ కౌన్సిల్‌ నుంచి డాక్టర్‌ ఎం.మాధవి, డాక్టర్‌ ఎస్‌ఎస్‌ విజయపద్మ, డాక్టర్‌ పి.శ్యామ్‌ సుందర్‌ రెడ్డిలను పాలకవర్గంలో నియమించారు. అలాగే చట్ట సభల నుంచి అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి, శాసన సభ్యులు జె.పద్మావతి, కె.భాగ్యలక్ష్మి, ఉన్నమట్ల ఎలీజాలకు అవ కాశం దక్కింది. అభ్యుదయ రైతుల కేటగిరీలో శ్రీకాకుళం జిల్లా నుంచి బత్తిన లక్ష్మినారాయణ, నెల్లూరు జిల్లాకు చెందిన దువ్వూరి చంద్రఽశేఖర్‌ రెడ్డి, శివప్రసాద్‌ రెడ్డిలను నియమించారు. వ్యవసాయ పారిశ్రామిక వేత్తల కోటాలో కేశవరెడ్డి, జి.సుమిత్ర రాజేష్‌లను నియమిస్తూ నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం కానుంది. కొత్తపోస్టుల నియామకం, కొత్త కోర్సులు అమలు, పరిశోధనా స్థానాలు ఏర్పాటు వంటి వాటికి అవకాశం ఉంటుంది.

నిధులే అసలు సమస్య

ప్రభుత్వం సుదీర్ఘ కాలం తర్వాత ఏర్పాటుచేసిన పాలకవర్గం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. పరిశోధనా స్థానాలను బలోపేతం చేయాలి. గతంలో పరిశోధనా స్థానాలు నూతన వంగడాల అభివృద్ధి చేసిన చరిత్ర ఉంది. ఒకేసారి 23 రకాల వంగడాలను విడుదల చేసి విశ్వవిద్యాలయం రికార్డు సృష్టించింది. జాతీయ స్థాయిలో ఐదు రకాల ఉద్యాన వంగడాలకు నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇదంతా విశ్వవిద్యాలయ పరిధిలో శాస్త్ర వేత్తల కృషి ఫలితంగానే సాధ్యపడింది. తాజాగా నిధుల సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. ఉద్యాన విశ్వ విద్యాలయం ప్రగతి పథంలో పయనించాలంటే ప్రభుత్వం తరపున నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. గత ప్రభుత్వాలు నిధులు సమకూర్చడంలో భరోసాగా ఉన్నాయి. నాబార్డ్‌ అండదండలు అందించింది. అప్పటి అధికారులు తమకు ఉన్నత స్థాయిలో ఉన్న పరి చయాలతోనూ భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచి నిధులు రాబట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత రాష్ర్టానికి జరిగిన నష్టాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి ముందు ఉంచగలిగారు. తద్వారా నిధులు రాబట్టి అభివృద్ధికి అప్పటి అధికారులు బాటలు వేశారు. తెలుగుదేశం హయాంలో నియమించిన పాలకవర్గం కూడా ఉద్యాన విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎనలేని కృషి చేసింది. కొత్త కళాశాలల ఏర్పాటు, పరిశోధానా స్థానాలు నెలకొల్పడం వంటి చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూము లతో పాటు, నిధులు కేటాయించడం వల్ల ఇవన్నీ కార్యరూపం దాల్చాయి. అదే తరహా అభివృద్ధి సాగా లంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం మెండుగా ఉండాలి. ఉద్యాన విశ్వవిద్యాలయ పాలక వర్గంలో చట్ట సభలనుంచి నియమితులైన ప్రజా ప్రతినిధుల కృషి చేస్తేనే ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది.

అటవీ భూములపై దృష్టి పెడతారా ?

కొత్తగా ఏర్పాటైన పాలకవర్గం అటవీ భూములపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఉద్యాన విశ్వ విద్యాలయానికి ఆనుకుని ఉన్న అటవీ భూములను కేటాయించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. అది కార్యరూపం దాల్చినట్టయితే ఉద్యాన విశ్వవిద్యాలయం ఊచించని రీతిలో అభివృద్ధి సాధించనుంది. అధ్యయన, పరిఽశోధనలు విరివిగా సాగనున్నాయి. ప్రధానంగా అంతరించిపోతున్న వృక్షజాతి పరిరక్షణ, ఔషధీయ మొక్కల పెంపకం, పరిశోధనలు వంటి ప్రణాళికలతో గతంలో అధికారులు ముందడుగు వేశారు. అయితే అటవీ భూములు కేటాయింపులు జరగలేదు. అటవీ శాఖతో ఉద్యాన విశ్వవిద్యాలయం కుదుర్చుకున్న ఒప్పందం ముందడుగు వేయలేదు., కనీసం ఒప్పంద మైనా అమలు జరిగితే ఉద్యాన విశ్వవిద్యాలయానికి వందల ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. దానిపైనా నూతన పాలకవర్గం దృష్టిపెట్టాలి.

Updated Date - 2022-12-16T00:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising