ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నారు: బొరగం శ్రీనివాసులు

ABN, First Publish Date - 2022-09-16T01:48:42+05:30

వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని, సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నారని పోలవరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని, సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నారని పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) విమర్శించారు. బుట్టాయిగూడెం మండలం జైనవారీగూడెం పంచాయతీలోని జైనవారిగూడెం గ్రామంలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజలను టాక్స్‌ల రూపంలో పీడిస్తున్నారని, పెట్రోల్ డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఇంటిపన్ను, చెత్తపన్ను విధిస్తూ వివిధ రకాలుగా ప్రజలను దోచేస్తున్నారని కరపత్రాల్లో వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీని గెలిపించాలని శ్రీనివాసులు అభ్యర్థించారు.


ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు వంజం సోమరాజు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి సున్నం నాగేశ్వరావు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం రామకృష్ణ నియోజకవర్గ ఎస్టీ సెల్ ఊపాధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు, తెలుగు మహిళ నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు జారం చాందిని విద్యాసాగరిక, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కప్పల నాగేశ్వరరావు, చిలకముడి సుధాకర్, బొబ్బర ఎలీషా, పుసులురి శ్రీనివాసరావు, గద్దె దుర్గారావు, గన్నిన సూర్యచంద్రరావు, మాజీ సర్పంచ్ తట్టి రంగారావు, తట్టి రమణ, తట్టి శేఖర్ గార్లు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-16T01:48:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising