ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపేసి కాల్వలో పడేసి..

ABN, First Publish Date - 2022-08-05T05:12:38+05:30

భార్యపై అనుమానం పెం చుకున్నాడు.

హతురాలు రమ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు

భర్త ప్రవర్తనపై పోలీసులకు అనుమానం

తానే చంపినట్టు ఒప్పుకున్న నిందితుడు 

నిడమర్రు ఆగస్టు 4 : భార్యపై అనుమానం పెం చుకున్నాడు. స్పృహ కోల్పో యేలా కొట్టి హతమార్చాడు. ఆపై శవాన్ని కాల్వలో పడేసి ఏమీ తెలియనట్లు తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులకు తమదైన శైలిలో విచారించే సరికి నిజం ఒప్పుకున్నాడు. నిడమర్రు ఎస్‌ఐ కె.గుర్రయ్య తెలిపిన వివరాలివి.. నిడమర్రుకు చెందిన చెన్నం వీరన్నకు అదే గ్రామానికి చెందిన రమ్య (23)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్య ప్రవర్తతపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను తరచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. వారు అద్దెకుంటున్న ఇంటిలో ఆదివారం అర్ధరాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. రమ్యను వీరన్న గట్టిగా కొట్టడం తో ఆమె సృహ  కోల్పోయింది. మరోసారి గట్టిగా కొట్టి హతమార్చాడు. అనంతరం తన భార్య మృతదేహాన్ని తన వ్యాన్‌లో గ్రామానికి సమీపంలోని పందికోడు మురుగు కాలువ వద్దకు తీసుకుని వెళ్లి కాల్వలోకి విసిరేసి ఏమి తెలియనట్టు వచ్చేశాడు. తర్వాత తన భార్య కనిపించడం లేదని వెతకడం మొదలు పెట్టాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం నిడమర్రు పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టాడు. వీరన్న ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు తమ పద్ధతిలో విచారించగా ఆమెను హత్య చేసినట్లు భర్త నేరం ఒప్పు కొన్నాడు. కాల్వలో శవాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుప త్రికి తరలించారు. వీరన్న, రమ్య దంపతులకు మూడేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరన్నపై సెక్షన్‌ 302 హత్యానేరం కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 




Updated Date - 2022-08-05T05:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising