ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెక్ట్స్‌ ఏంటి..?

ABN, First Publish Date - 2022-12-07T00:30:44+05:30

ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ప్రజలను మరింత చైతన్యపర్చడానికి పార్టీకి వారి నుంచి మద్దతు పెరిగేలా చేసేందుకు ఈ మధ్యనే టీడీపీ రూపొందించిన ‘ఇదేం ఖర్మ’ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి తనకు ఇష్టమైన ఉమ్మడి పశ్చిమలోనే అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

నిడదవోలులో ‘ఇదేంఖర్మ’ సభలో మాట్లాడుతున్న చంద్రబాబు, పక్కన శేషారావు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఏలూరు – ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ప్రజలను మరింత చైతన్యపర్చడానికి పార్టీకి వారి నుంచి మద్దతు పెరిగేలా చేసేందుకు ఈ మధ్యనే టీడీపీ రూపొందించిన ‘ఇదేం ఖర్మ’ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి తనకు ఇష్టమైన ఉమ్మడి పశ్చిమలోనే అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మూడురోజులు ఏకధాటిగా 300 కిలో మీటర్ల నిడిమిన రాత్రి పొద్దుపోయేంత వరకు బహిరంగ సభలు, భేటీలు నిర్వహిస్తూ ఆరు నియోజకవర్గాలను చుట్టుము ట్టారు. తన రాక కోసం ఎదురుచూస్తున్న వివిధ వర్గాల ను పలకరిస్తూ ఉత్సాహపరుస్తూ.. నేతల తీరును గమని స్తూనే పర్యటన సాగింది. ఇన్‌చార్జీలే లేని నియోజక వర్గాలను ఎంచుకుని మరీ తమ పార్టీ అధినేత ఒకింత సాహసమే చేశారని యాత్ర ముగిసిన తరువాత స్థానిక నేతలు చర్చించుకున్నారు. అత్యంత కీలక స్థానాలు కా కుండా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ మూడుస్థానాల్లోనూ పార్టీ స్థితిగతులు చంద్రబాబు పర్యటనలో బహిర్గతమయ్యా యి. గడచిన మూడున్నరేళ్లుగా ఇన్‌చార్జిగా ఎవరి సార థ్యం లేక నాయకుల ఉమ్మడితనంపైనే ఇప్పటివరకు చిం తలపూడి నియోజకవర్గం ఒకటిగా ఉంది. ఇక్కడ టీడీపీ టికెట్లు ఆశించిన వారి సంఖ్యకు కొదవలేదు. రెండు డజ న్లకు పైగా ఆశావహులు ఇప్పటికే మోహరించి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి రంగంలోకి దిగుతామని కొందరు, ఎంత ఖర్చయినా వెన కాడబోమని కొందరు, సామాజికపరంగా తమకు తిరు గులేదంటూ ఇంకొందరు వ్యక్తిగత అంచనాలతో మరీ తమ ఉనికి తెలిసేలా స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు కట్టారు. ఎక్కడా భేదం లేకుండా చంద్రబాబు వెంటే నడిచారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, మాజీమంత్రి పీతల సుజాత, ముత్తా రెడ్డి, ఘంటా సుధీర్‌బాబు, దాసరి శ్యామ్‌చంద్ర శేషు, మండవ లక్ష్మణరావు, చలపతి, ఆకుమర్తి రామా రావు, పగడం సౌభాగ్యవతి, గుడిపూడి రవి, కొక్కిరిగడ్డ జయ రాజు, రోషన్‌కుమార్‌, అంబేద్కర్‌ వంటి వారెందరో ఏ విభేదం లేకుండా ఉమ్మడిగా పనిచేశారు. గడచిన కొద్ది మాసాలుగా ఈ నియోజకవర్గంలో పార్టీ పుంజుకుంది. ఆ మేరకు వైసీపీ గ్రాఫ్‌ తగ్గిందనే అంచనాల్లో మరికొందరు న్నారు. ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు చింతల పూడి లో జరిగిన తన సభకు హాజరైన జనం దారిపొడుగునా వేచి ఉండి దీవెనలిచ్చిన ఆయావర్గాల పట్ల ఒకింత సం తృప్తి వ్యక్తంచేశారు. ఇక దీన్నిబట్టి నియోజకవర్గ ఇన్‌చా ర్జి అంటే వచ్చేఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని ఖరారు చేసేలా నియామకం ఉండబోతుందని ప్రచారం ఊపం దుకుంది. ఇంతకు ముందులా నాన్చకుండా సాధ్య మైనం త త్వరగానే వివిధవర్గాల అభిప్రాయం మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అందరి అంచనా లకు భిన్నంగా ఉండబోతుందా.. లేదంటే ఊహించిన ట్టుగానే జరగబోతుందా అనే సస్పెన్స్‌ పార్టీలో ఉంది.

కొవ్వూరు కథ తేల్చేస్తారా

ఇప్పటికే కొవ్వూరు టీడీపీలో నెలకొన్న పరిస్థితులను పూర్తిగా బేరీజు వేసి తదనుగుణంగానే ద్విసభ్య కమిటీ కొనసాగింపుతో పాటు మరేదైనా కీలకనిర్ణయం తీసుకోబో తున్నారా. ఆ మేరకు సీరియస్‌ చర్చకు తెర లేపపోతు న్నారా, అధినేత చంద్రబాబు తాజా స్థితిగతులను గమనించిన తరువాత ఏం చేయబోతున్నారనే సస్పెన్స్‌ కొవ్వూరు నియోజకవర్గ నేతల్లో ఉంది. ఇక్కడ పార్టీని ఏకతాటిపై తెచ్చేందుకు పదేపదే సమాచారం రాబడుతూ ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ ఆ మేరకు ఏకాభిప్రా యానికి వచ్చేలా టీడీపీ జాగ్రత్త పడుతూ వచ్చింది. అయినా కొవ్వూరులో తాను పాల్గొన్న బహిరంగ సభకు జనం ఆశించినంత సంఖ్యలో హాజరుకాకపోవడం, ఇక్కడ వర్గాల వారీగా నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేయ డం, ఉమ్మడితనం దెబ్బతినడం వంటి పరిణామాలను ఇక పార్టీ సీరియస్‌గా తీసుకోబోతుందని అంచనా. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జవహర్‌ వర్గం ఒక వైపు, మిగతా వారంతా ఇంకో వర్గంగా మోహరించారు. అదే కనుక ఏకతాటిపై నిలబడి పనిచేస్తే కొవ్వూరు సభ అద్భుతంగా పేలి ఉండేదన్న జనాభిప్రాయాన్ని టీడీపీ పరిగణలోకి తీసుకుంది. సీనియర్లు సైతం దాదాపు ఇదే నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు పార్టీ ఎలాంటి ’’చికిత్స’’ కు దిగబోతోంది. లేదా రాబిన్‌శర్మ బృందం విశ్లేషలను, సర్వే అంశాలను గమనించ, తగిన పరిణామాలను బేరీజు వేసిన తరువాతే తుది నిర్ణయానికి రాబోతున్నారా అనేది త్వరలోనే తేలిపోతుందనేది సమాచారం. ఆది నుంచి పార్టీకి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఈ పరి ణామాలన్నీ పార్టీకి నష్టదాయకం కాకూడదనే నిర్ణయం తోనే ఇప్పటి వరకు చంద్రబాబు ఆచితూచి అడుగేస్తూ వచ్చారు. ఇక నుంచి ఈ నియోజకవర్గంలోనూ దూకుడు పెంచే నిర్ణయాలు ఉండబోతున్నాయని మరో ప్రచారం. దీనికి తగ్గట్టుగానే అవుననే సంకేతాలే ఇప్పటికీ విస్తరించాయి.

నిడదవోలులో నేర్పరితనం

టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో నిడదవోలు ఒకటి, ఈ నియోజకవర్గంలో తన పర్యటన సంద ర్భంగా వేలాది మంది తరలిరావడం, అపూర్వ స్వాగతం పలకడం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకట్టుకుంది. అయితే వివిధ వర్గాల వారీగా విడిపోయి ఆ మేరకు ఆహ్వానం లోనూ, సభకు హాజరవ్వడంలోనూ పోటీలు పడటాన్ని చంద్రబాబు గమనించారు. గ్రామాల్లో పార్టీ పట్టు చెదిరిపోలేద న్నట్టుగా కొవ్వూరు నుంచి నిడదవోలు వచ్చేంత వరకు పలు గ్రామాల్లో వేచి ఉన్న గ్రామస్థులు, మహిళలు హారతులు పట్టడాన్ని పార్టీ గుర్తించింది. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మరో సీనియర్‌ నేత కుందుల సత్యనా రాయణ, ఇంకో ఆశావహుడు దొరయ్య వంటి నేతలంతా నిడదవోలు పర్యటనలో ప్రముఖ పాత్ర పోషించారు. మిగతా నియోజకవర్గాల మాదిరిగానే ఈ నియోజవర్గానికి పార్టీ ‘‘సారఽథి’’ ఎవరో తేల్చేం దుకు నిష్పష్టత ప్రకటన చేసేందుకు టీడీపీ సంసిద్ధం అవుతోంది. గోపా లపురం ఇన్‌చార్జిగా మద్దిపాటి వెంకటరాజును ఏరకంగా ప్రకటించారో అదే రూపంలో చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో కూడా ఉండబోతున్నాయన్నది అంచనా. పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా కళ్లారా గమనించిన అంశాలు, సర్వే నివేదికలు, పార్టీ అంతరంగీకులు ఇచ్చిన అభిప్రాయాలన్నింటినీ బేరీజు వేసే విధాన ప్రకటన చేస్తారనేదే పార్టీ ప్రచారం. అది కూడా సంక్రాంతి ముందా, తరువాత అనేది ఇంకా తేలాల్సి ఉంది.

Updated Date - 2022-12-07T00:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising