ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26 వేల రైతులకు.. భరోసా హుళక్కేనా..?

ABN, First Publish Date - 2022-09-10T06:25:07+05:30

జిల్లాలో 26 వేల మంది రైతులకు రైతు భరోసా అందడం ప్రశ్నార్థకంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ఈకేవైసీలో నమోదు కాని 25 శాతం రైతులు

క్షేత్రస్థాయిలో అందని సమాచారం 

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 9 : జిల్లాలో 26 వేల మంది రైతులకు రైతు భరోసా అందడం ప్రశ్నార్థకంగా మారింది. రైతులకు కేంద్రం నుంచి అందించే  రూ.6 వేలు భరోసాను ఈసారి పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతీ రైతు ఈకేవైసీ తప్పనిసరిగా చేసింది. ఆగస్టు నెలాఖరు నాటికి  పూర్తి చేయాల్సి ఉండగా వ్యవసాయాధి కారులు పూర్తి చేయలేకపోవడంతో మరో ఏడు రోజులు గడువు పొడి గించింది. క్షేత్రస్థాయిలోని రైతులకు పూర్తిగా సమాచారం లేదు. అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం కొరవడి రైతులకు సమాచారం అందించడంలో విఫలమ య్యారు. జిల్లాలో 1,03,155 మందికి ఈకేవైసీ చేయించాల్సి ఉండగా గడువు పూర్తయ్యేనాటికి 26,274 మందికి ఈకేవైసీ పూర్తి కాలేదు. అంటే మొత్తం రైతుల్లో 25 శాతం మందికి భరోసా ప్రశ్నార్థకంగా మారింది. అత్యధికంగా ఇరగవరం మండలంలో 3,962 మంది రైతులు, పెనుగొండ మండలంలో 3,107 మంది, పోడూరు మండలంలో 2792 మంది, యలమంచిలి మండలం లో 2,247 మంది రైతులు నష్టపోనున్నా రు. కింద స్థాయి వరకూ వలంటీర్‌లు, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ అధికా రులు, సిబ్బంది ఉన్నా రైతులకు సమా చారం అందించడంలో విఫలం కావడం తో 25 శాతం మంది అనర్హులుగా మిగిలి పోవాల్సి వచ్చింది.

ఈకేవైసీ తప్పనిసరి 

కేంద్రం నుంచి అందించే రైతు భరోసా సొమ్ములు జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరి. ఈ నెల 7 వరకు మాత్రమే గడువు విధించినా ఆ సైట్‌ ఇంకా ఈకే వైసీ తీసుకుంటోంది. ఎప్పుడు అది క్లోజ్‌ అవుతుందో తెలియదు. ఎవరైనా ఈకేవైసీ చేయించుకునే వారు ఉంటే త్వరగా చేయించుకోవచ్చు.  

– పి.మురళీకృష్ణ, ఏడీఏ తాడేపల్లిగూడెం 

Updated Date - 2022-09-10T06:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising