ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఆర్‌ఆర్‌ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-27T05:44:35+05:30

సమాజ, విద్యార్థుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని, అలా కాని పక్షంలో ఎయిడెడ్‌ విధానంలోనే కొన సాగించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌
ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 26: సమాజ, విద్యార్థుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని, అలా కాని పక్షంలో ఎయిడెడ్‌ విధానంలోనే కొన సాగించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. ఎయిడెడ్‌ కళాశాల ఫెడరేషన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ప్రజా సంఘాల భాగస్వా మ్యంతో ఏర్పాటు అయిన ఐక్య పోరాట వేదిక (జేఏసీ) రౌండ్‌ టేబుల్‌ సమా వేశం బుధవారం ఏలూరు సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్సీ మాట్లాడుతూ 36 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు, దాతల సహకారం, రుసా నిధులు, యూజీసీ, ఎంపీ నిధులతో నిర్మితమైన సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల సమాజ ఆస్తిగానే ఉండాలని, ప్రైవేట్‌ పరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చ రించారు.   పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రా మ్మోహన్‌ మాట్లాడుతూ సీఆర్‌ఆర్‌ కళాశాల అధ్యాపకులను వెనక్కి రప్పించా లని, పాలకవర్గం ప్రభుత్వానికి లేఖ పంపాలన్నారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గౌరీశంకర్‌, ఐఎఫ్‌టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటే శ్వరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాని, భూషణం, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్‌, యూటీఎఫ్‌ నాయకులు సుభాషిని, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు మహేష్‌, పీడీఎస్‌యూ నాయకులు జానకీరామ్‌, క్రాంతి, రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising