ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌర్ణమి పోటు

ABN, First Publish Date - 2022-08-14T04:56:16+05:30

గోదావరి వరద ప్రవాహానికి పౌర్ణమి పోటు తాకింది.

పెదలంకలో పడవలపై రాకపోకలు సాగిస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిగబెట్టిన సముద్రం.. గోదావరి వరద వెనక్కి..
లోతట్టు ప్రాంత ప్రజల్లో ఆందోళన
ముంపులోనే పెదలంక, కనకాయలంక  


నరసాపురం/యలమంచిలి/ ఆచంట, ఆగస్టు 13 : గోదావరి వరద ప్రవాహానికి పౌర్ణమి పోటు తాకింది. సముద్రం బిగబెట్టడం తో ప్రవాహం ముందుకు సాగక నీటి మట్టాలు క్రమంగా పెరుగు తున్నాయి. ఈ కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే సముద్రంలోకి వస్తోంది. ఇటీవల వచ్చిన వరదల సమయంలోకంటే ఈ ప్రవాహం చాలా తక్కువ. అయితే సముద్రం నీరును లాక్కోక్కపోవడం వల్ల రెండో ప్రమాద హెచ్చరికకే లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. పట్టణం లోని అన్ని రేవులతోపాటు పొన్నపల్లి, నందమూరి కాలనీ, నవ రసపురం ఎస్టీ కాలనీ, లాకు పేటల్లోకి నీరు చేరుతోంది. లాకుల నుంచి వరద నీరు బయటకు వస్తుండడంతో డ్రెయిన్లు, పంట కాల్వల గుండా నీరు లోతట్టు ప్రాంతాలను ముంచేస్తోంది. రాను న్న 2రోజుల్లో ఈ ప్రభావం తగ్గొచ్చని అధికారులు భావిస్తున్నారు.
యలమంచిలి మండలంలోని పెదలంక, కనకాయలంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు రెండు రోజులుగా పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. బాడవ లో పల్లపు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉంది. యలమంచిలి, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, చించినాడ, ఏనుగువాని లంక, దొడ్డిపట్ల పల్లిపాలెం, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాల లంక భూముల్లోకి చేరిన వరదనీరు నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం నాటికి వరద తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆచంట మండలంలో గోదావరి ప్రవాహం పెరుగుతూనే ఉంది. శనివారం మరింత పెరగడంతో పెదమల్లం మాచేనమ్మ ఆలయం వద్దకు వరద నీరు చేరింది. ఆలయ ప్రాంగణం నీటమునిగింది. కోడేరు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. అధికారులు కోడేరు వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. 

Updated Date - 2022-08-14T04:56:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising