కుటుంబం వెలి.. మైక్‌లో ప్రచారం
ABN, First Publish Date - 2022-08-05T05:05:59+05:30
చినిమిల్లిపాడు గ్రామ సర్పంచ్ భర్త, వైసీపీకి చెందిన గురదాసు బాలాజీ(వైసీపీ), కొందరు గ్రామస్తులు కలిసి తమ కుటుంబాన్ని వెలి వేస్తున్నట్లు మైక్‌లో ప్రచారం చేస్తున్నారు.
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు.. విచారణ చేస్తామన్న ఎస్‌ఐ
ఆకివీడు రూరల్ ఆగస్టు 4 : ‘చినిమిల్లిపాడు గ్రామ సర్పంచ్ భర్త, వైసీపీకి చెందిన గురదాసు బాలాజీ(వైసీపీ), కొందరు గ్రామస్తులు కలిసి తమ కుటుంబాన్ని వెలి వేస్తున్నట్లు మైక్‌లో ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబంతో మాట్లాడిన వారికి రూ.10 వేల జరిమానా, మాట్లాడినట్టు చూసి చెప్పిన వారికి రూ.5 వేలు బహుమతి ఇస్తామంటున్నారు. ఏడాది క్రితమూ ఇలాగే జరిగింది. ఇప్పుడు మళ్లీ వెలివేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని గ్రామానికి చెందిన బలే నాగేశ్వరరావు తెలిపాడు. ‘ఏడాది క్రితం మా చేపల చెరువు గట్టుపై నుంచి అక్రమంగా రోడ్డు వేయడానికి బాలాజీ ప్రయత్నించగా అడ్డుకున్నా. అప్పటి నుంచి టీడీపీకి చెందిన నాపై కక్ష కట్టి మా కుటుంబాన్ని వెలివేస్తున్నట్టు ప్రకటించారు. మైక్‌లో చేస్తున్న ప్రచారాన్ని రికార్డు చేసి పోలీసులకు అందజేశా. వెలి పేరుతో గురదాసు బాలాజీ, బలే నరేష్, గురదాసు చంద్రశేఖర్, ముంగర రత్నంగిరాజు, సైదు ఏసుపాదం, సైదు పెద్దిరాజు, ఘంటసాల సుబ్బారావు, బలే వెంకటేశ్వరరావు, బలే సూరిబాబు, బలే శ్రీను, ఘంటసాల నాగరాజు తదితరులు మానసిక క్షోభకు గురి చేస్తు న్నారు. నా కుటుంబానికి న్యాయం చేయాలి’ అని బాధితుడు కోరుతున్నాడు. దీనిపై ఎస్‌ఐ యుగంధర్ కిరణ్‌కుమార్ మాట్లా డుతూ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడం వాస్తవమేనని, శుక్రవారం తహసీల్దార్‌తో కలిసి గ్రామానికి వెళ్లి విచారణ చేస్తామన్నారు.
Updated Date - 2022-08-05T05:05:59+05:30 IST