ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిగమర్రు టు ఆకివీడు నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ

ABN, First Publish Date - 2022-04-24T05:37:09+05:30

జిల్లాలో మరో జాతీ య రహదారి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేంద్రం రూ.వెయ్యి కోట్లు మంజూరు
రెండుచోట్ల రైల్వే వంతెనలు

నరసాపురం, ఏప్రిల్‌ 23 : జిల్లాలో మరో జాతీ య రహదారి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది. పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు ప్రస్తుతం ఉన్న 165వ జాతీయ రహదారిని నాలుగు లైన్లగా విస్తరిస్తున్నారు. దీనిలో రెండో ప్యాకేజీగా దిగమర్రు నుంచి ఆకి వీడు వరకు ప్రస్తుతం వున్న రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. 40 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ అభివృద్ధి పనులకు కేంద్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. త్వరలో ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే పామర్రు నుంచి ఆకివీడు వరకు మొదటి ప్యాకేజీ పనులను ప్రారంభించారు.
కత్తిపూడి – ఒంగోలు 216 జాతీయ రహదారిలో దిగమర్రు జంక్షన్‌ నుం చి 165 జాతీయ రహదారి పాలకొల్లు, భీమవరం మీదుగా కృష్ణా జిల్లా పామర్రు వెళుతుంది. ఇటు 216 జాతీయ రహదారి నరసాపురం మీదుగా ఒంగోలు వెళుతుంది. ఈ రెండు రహదార్లలో భీమవరం మీదుగా వెళ్లే 165 జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ బాగా పెరిగింది. దీన్ని పరిగణనలోకి తీసు కుని ఈ రోడ్డును నాలుగు లైన్లుగా మార్చాలని గతంలో ప్రతిపాదించి సర్వే చేపట్టారు. డీపీఆర్‌ రిపోర్టు కేంద్రానికి పంపారు. ఈ ఏడాది బడ్జెట్‌ లో ఈ రోడ్డు విస్తరణకు రూ.1,000 కోట్లు కేటాయించారు. దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 40 కిలోమీటర్ల మేర ఫోర్‌లైన్‌ను అభివృద్ధి చేస్తా రు. పట్టణాలు, గ్రామాల మీదుగా వెళుతున్న ప్రస్తుత రూట్‌ను బైపాస్‌గా మార్చనున్నారు. రెండుచోట్ల రైల్వే వంతెనలు నిర్మించనున్నారు. ఇప్పటికే మొదటి పేజ్‌లో ఆకివీడు నుంచి పామర్రు వరకు ప్రతిపాదించిన పనుల కు టెండర్లు పూర్తయ్యాయి. రెండో పేజ్‌లో దిగమర్రు, ఆకివీడు పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి పనులను ప్రారంభిస్తామని జాతీయ రహదారి విస్తరణ  ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-04-24T05:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising