బియ్యం ఉచితమట..!
ABN, First Publish Date - 2022-12-31T23:57:03+05:30
జనవరి 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ ప్రారం భం కానుంది.
నేటి నుంచి రేషన్ పంపిణీ
నగదుకు పంచదార, కందిపప్పు
ప్రభుత్వ మార్పులతో డీలర్లు, ఎండీయూ వాహనదారుల్లో గందరగోళం
ఉండి, డిసెంబరు 31 : జనవరి 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ ప్రారం భం కానుంది. ఇందుకు సంబంధించి సివిల్ సప్లయీస్ అధికా రులు సమాయత్తమయ్యారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణా లకు సివిల్ సప్లయీస్ గొడౌన్స్ నుంచి రేషన్ సరఫరా పూర్త య్యింది. అయితే నూతన సంవత్స రంలో ప్రభుత్వం పంపిణీలో మార్పులు చేసింది. గతంలో కిలో బియ్యానికి రూపాయి తీసు కునేవారు. పంచదార, కందిపప్పు నగదుకు రేషన్ పంపిణీ చేసే వారు. అయితే 2023 జనవరి నుంచి కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని ఎండీయూ వాహనదారులకు అధి కారులు సూచించారు. పంచదార, కందిపప్పులు మాత్రం నగదు కు అందించాలని పేర్కొన్నారు. పైగా ఒక వేలిముద్ర బియ్యానికి వేయాలని, మరొక వేలిముద్ర నగదు సరుకులైన పంచదార, కందిపప్పులకు కార్డుదారులచే వేయించాలని సూచించారు. ఈ మార్పుతో డీలర్లు, ఎండీయూ వాహనదారులు గందరగోళం పడుతున్నారు. ప్రతీనెల రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులకు అందిం చే నగదు బియ్యం కింద ఈ బియ్యాన్ని జమ చేయాలా.. లేదా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో రేషన్ దుకాణాల వద్ద ఇచ్చే ఉచిత బియ్యం కింద పరిగణించాలా తెలియక తల లు పట్టుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం పెడుతున్న మెలికలు అర్థం కావడం లేదంటూ డీలర్లు వాపోతున్నారు.
Updated Date - 2022-12-31T23:57:07+05:30 IST