అమరజీవికి ఘన నివాళి
ABN, First Publish Date - 2022-12-16T00:07:32+05:30
ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మదిలో నిలిచారని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.
భీమవరం టౌన్/ భీమవరం క్రైం, డిసెంబరు 15: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మదిలో నిలిచారని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ముందుగా శ్రీరాములు చిత్రపటానికి పూలవేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాషా ప్రయోక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహా పురుషుడన్నారు. యువత ఆయన స్పూర్తితో ముందుకెళ్లా లన్నారు. జేసీ మురళి, జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో దాసిరాజు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధికారి గణ పతిరావు, తదితరులు పాల్గొన్నారు.
ఫ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యు.రవిప్రకాష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించా రు. ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆకుల రఘు, రిజర్వు డీఎస్పీ సత్యనారాయణ, డీపీవో రామ్‌మోహన్, శ్రీకాంత్, సిబ్బం ది, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:07:36+05:30 IST