సచివాలయ అధికారుల తప్పిదం..
ABN, First Publish Date - 2022-08-04T05:47:52+05:30
అధికారుల తప్పిదానికి ఒక వృద్ధుడు పింఛన్ కోల్పోయాడు.
వృద్ధాప్య పింఛన్ రద్దు.. సొమ్మసిల్లిన బాధితుడు
వీరవాసరం, ఆగస్టు 3 : అధికారుల తప్పిదానికి ఒక వృద్ధుడు పింఛన్ కోల్పోయాడు. మెంటేపూడికి చెందిన కొల్లా సత్యనారాయణ 72 ఏళ్ల వృద్ధు డు. ఎన్నో ఏళ్లుగా వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాడు. అయితే ఇటీవల పింఛన్ వెరిఫికేషన్‌లో నాలు గు చక్రాల వాహనం ఉన్నట్టు ఆన్‌లైన్ సర్వేలో చూపింది. దీంతో తనకు నాలుగు చక్రాల వాహనం లేదని తన కుటుంబం నిరుపేద కుటుంబం అని తెలుపుతూ సంబంధిత పత్రాలను స్థానిక సచివాలయ అధికారులకు అం దించాడు. అయితే ఆ పత్రాలను సకాలంలో అప్లోడ్ చేయని కారణంగా పింఛన్ రద్దయింది. ఈ విషయం తెలియక ఈనెల పింఛన్ రాలేదంటూ సత్యనారాయణ బుధవారం ఎంపీడీవో కార్యాల యానికి వచ్చి అధికారులను కలిశాడు. ‘నీకు నాలుగు చక్రాల వాహ నం ఉంది.. ఆ కారణంగానే పింఛన్ జాబితా నుంచి తొలగించారు.. రద్దయిన పింఛన్ స్థానంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.. కొత్త పింఛన్ రావడానికి ఆరునెలలు సమయం పడుతుంది’.. అని సిబ్బంది చెప్పడంతో ఒకసారిగా నిస్సత్తువకు లోనై కుప్పకూలిపోయాడు. స్థానిక పీహెచ్‌సీ సిబ్బందిని తీసుకొచ్చి ప్రాఽథమిక చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకున్నాడు. తనకు ఏ ఆధారం లేదని, ఇప్పుడు పింఛన్ కూడా రద్దయిందని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
Updated Date - 2022-08-04T05:47:52+05:30 IST