ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావుళ్లమ్మ నిజరూప దర్శనం నిలిపివేత

ABN, First Publish Date - 2022-12-16T00:05:17+05:30

మావుళ్లమ్మ నిజరూప దర్శ నాన్ని గురువారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు.

ఆలయం వెనుక అమ్మ వారి ఉత్సవమూర్తి, కలశా నికి హారతులు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, డిసెంబరు 15 : మావుళ్లమ్మ నిజరూప దర్శ నాన్ని గురువారం నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. వచ్చేనెల 13నుంచి నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ, దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారి 59వ వార్షిక మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ఆల యానికి, అమ్మవారి విగ్రహానికి రంగులు వేసే నిమిత్తం నిజరూప దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లిఖార్జునశర్మ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం వేదపాఠశాల ప్రిన్సిపాల్‌ వేదపండిట్‌ తంగిరాల వెంకట దత్తాత్రేయ శర ్మ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. ప్రధాన కలశంలో అమ్మవారి కళలను నిక్షిప్తం చేసి ఆలయ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన మందిరంలో ఉంచి ఉత్సమూర్తికి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. ఈనెల 29 నుంచి భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం కల్పించనున్నారు. అప్పటి వరకు ఆలయ వెనుకభాగంలో నిత్యపూజలు, పంచహారతులు, మహా నివేదన నిర్వహిస్తారు. ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ, ఆలయ చైర్మన్‌ మానేపల్లి నాగేశ్వరరావు, ఆలయ వేదపం డితుడు ఈమని వెంకట సోమయాజీ, ధర్మకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:05:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising