ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు కృష్ణంరాజు సంస్మరణ సభ

ABN, First Publish Date - 2022-09-29T05:37:22+05:30

కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజుకు గురువారం ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించే సంస్మరణ సభకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.

కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేస్తున్న స్టేజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్తూరుకు ప్రభాస్‌..
రానున్న సినీ ప్రముఖులు
భారీగా పోలీసు బందోబస్తు.. ఏర్పాట్లు పూర్తి

మొగల్తూరు, సెప్టెంబర్‌ 28 : కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజుకు గురువారం ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించే సంస్మరణ సభకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు నివాసానికి వచ్చేందుకు ప్రధాన రహదారి వెంబడి అగ్రహారం వైపునకు వెళ్లేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటుచేశారు. ఈ మార్గం నుంచి ప్రతీ ఒక్కరూ వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్‌పై వున్న సినీ హీరో, కృష్ణంరాజు సోదరుడి కుమారుడు ప్రభాస్‌ను పరామర్శించవచ్చు. కృష్ణంరాజు ఇంటికి ఎదురుగావున్న తోటలో 50 వేల మందికిపైగా హాజరుకానున్న ప్రజలకు భోజన ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ ఆధ్వ ర్యంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మధ్యాహ్నానికి కృష్ణంరాజు సతీమణి శ్యామ లాదేవి, ఆయన కుమార్తెలు, ప్రభాస్‌ అన్న ప్రభోద్‌, కృష్ణంరాజు మేనల్లుళ్లు విజయ్‌బాబు, నరేంద్ర, త్రినాథ్‌, మరికొందరు బంధువులు తరలివచ్చారు. కృష్ణం రాజు సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఏర్పాట్లు చేశా రు. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పలుసార్లు ఏర్పాట్లు పర్యవేక్షించి ప్రభు త్వపరంగా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. కృష్ణంరాజు సంస్మరణ సభకు రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సంస్మరణ సభకు ఎస్పీ రవిప్రకాశ్‌ పర్య వేక్షణలో ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 17 మంది ఎస్‌ఐలు, 50 మంది కాని స్టేబుళ్లు, హోం గార్డులను నియమించి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
12 ఏళ్ల తర్వాత..  
యంగ్‌ రెబల్‌స్టార్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఆయన సొంతూరు మొగ ల్తూరుకు 12 ఏళ్ల తర్వాత గురువారం రానున్నారు. ఆయన పెదనాన్న కృష్ణంరాజు కు మొగల్తూరుతో వున్న అనుబంధంతో ఇక్కడ ప్రత్యేకంగా సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-09-29T05:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising