ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందా..గోవింద

ABN, First Publish Date - 2022-09-25T06:24:06+05:30

కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం స్వామికి సప్త నదుల జలాభిషేకం జరిపారు.

స్వామికి సప్తనదులతో జలాభిషేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సప్తనదుల జలాలతో కాళ్ళకూరు వెంకన్నకు జలాభిషేకం

కాళ్ళ, సెప్టెంబరు 24 : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా  శనివారం స్వామికి సప్త నదుల జలాభిషేకం జరిపారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు సప్త నదులైన గోదావరి, సరస్వతి, యమునా, గంగా, కృష్ణ, కావేరీ, నర్మదా నదుల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో  అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా సప్తనదీ జలాలు, పవిత్రాలతో గ్రామంలో శోభయాత్ర నిర్వహించి అష్టోత్తర కలశార్చన చేశారు. శాంతి కల్యాణం మహోత్సవం అష్టోత్తర పూజలు నిర్వహించారు.  స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు బారులు దీరారు.  ఆలయ చైర్మన్‌ దండు వెంకట కృష్ణంరాజు, గాదిరాజు లచ్చిరాజు, కాళ్ళకూరు సొసైటీ అధ్యక్షుడు గాదిరాజు వినోద్‌వర్మ, నడింపల్లి ప్రదీప్‌రాజు, తోటకూర రవిరాజు, సాధు శ్రీనివాస్‌, అడ్డాల శివరామరాజు, గ్రామ పెద్దలు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈవో చాగంటి సురేష్‌నాయుడు, ధర్మకర్తలు, సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2022-09-25T06:24:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising