ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

ABN, First Publish Date - 2022-01-22T05:30:00+05:30

బాల్య వివాహాల నిర్మూలన ప్రజల బాధ్యత అని, వాటిని నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి డి.బాలకృష్ణయ్య అన్నారు.

మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బాలకృష్ణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బాలకృష్ణయ్య
పెదవేగి, జనవరి 22 : బాల్య వివాహాల నిర్మూలన ప్రజల బాధ్యత అని, వాటిని నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి డి.బాలకృష్ణయ్య అన్నారు. కొప్పాక సచివాలయంలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో పాల్గొన్న బాలకృష్ణయ్య మాట్లాడుతూ గ్రామాల్లో నేటికీ బాల్యవివాహాలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై ప్రజల ను చైతన్యవంతం చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. పెరుగు తున్న కరోనా వైరస్‌ కట్టడిలో ప్రజలు మరింతగా భాగస్వాములు కావాలని, అప్పుడే కరోనా మహమ్మారిని తరిమికొట్టే వీలుంటుందన్నారు. కొవిడ్‌ మహ మ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం పరిహారం అందిస్తోందని, అటువంటి వారిని గుర్తించి, పరిహారం అందించే దిశగా సచివా లయ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలకు న్యాయసేవాధికార సంస్థ ఉచిత న్యాయాన్ని అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ప్యానల్‌ లాయర్‌ పి.వెంకటేశ్వ రరావు, గ్రామ ఉప సర్పంచ్‌ రమాదేవి, గ్రామ కార్యదర్శి ఎం.వెంకటరావు, సచివా లయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising