ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లపై.. యమ పాశాలు!

ABN, First Publish Date - 2022-11-11T23:26:17+05:30

విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులకు తెలిపినా పట్టించుకో వడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరెంట్‌ స్తంభం వేయకపోవడంతో కర్ర సాయంతో నిలబెట్టిన మెయిన్‌ వైరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రమాదకరంగా కరెంటు మెయిన్‌ వైర్లు

అరకొరగా స్తంభాలు.. కర్ర సాయంతో తీగలు

ఆకివీడు వీరమల్లు కాలనీ చెంచులు ఆవేదన

ఆకివీడు, నవంబరు 11: విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులకు తెలిపినా పట్టించుకో వడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమతానగర్‌లోని వీరమల్లు కాలనీలో 130 చెంచుల కుటుంబాలు 30 ఏళ్లుగా నివాసం ఉం టున్నాయి. కూలి పనులకు వెళ్తుంటా రు. సరైన ఇళ్లు లేక పూరిపాకలో ఉంటున్నారు. రోడ్లు సక్రమంగా లేవు. ఈ కాలనీకి విద్యుత్‌ అధికారులు సరిపడా స్తంభాలు వేయకపోవడంతో మెయిన్‌ వైర్లు ఇళ్ల మీద నుంచి ప్రమాదకర రీతిలో వెళ్లాయి. కాలనీ వాసులు భయంతో పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. ఉన్న నాలు గు కరెంటు స్తంభాలు ఒరిగిపోయాయి. వైర్లు ఇళ్ల మీద పడకుండా కర్రల సాయంతో ఆపారు. వర్షాకాలంలో ఇళ్లు తడిచి కరెంటు సరఫరా అయిన ఘట నలు ఉన్నాయి. అధికారులకు చెప్పిన ఫలితం ఉండడం లేదని ప్రైవేటుగా డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నామంటూ నర్సమ్మ, యోగిని, సాయమ్మ, రూతమ్మ, పెద్దులు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ముస్లిం వీధిలో ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి కరెంటు వైర్లు ప్రమాదభరితంగా ఉన్నాయి మార్పు చేయాలని నగదు చెల్లించినా పట్టించుకోవడం లేదని యజమానులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. పట్టణ పరిధిలోను పలుచోట్ల వైర్లు వేలాడుతు న్నాయి. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే విద్యుత్‌ వైర్లు గతంలో వేశా రని, ఇప్పుడు ఇళ్లు నిర్మాణం చేస్తుండడంతో సమస్యలు వస్తున్నాయని, పరిష్కరిస్తామని చెబుతున్నారు.

చెంచులు కావడంతో పట్టించుకోవడం లేదు

విద్యుత్‌ వైర్లు ఇళ్ల మీద నుంచి వెళ్లడంతో చెంచులు దినదిన గండంగా గడుపుతున్నారు. పలుమార్లు పాలకులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకొనే నాథుడే లేడు. వర్షాలతో పాకలు తడిచి కరెంటు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

– వాశింశెట్టి సత్యవతి, ఐద్వా నాయకురాలు, ఆకివీడు

ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా..?

విద్యుత్‌ సమస్యతో ప్రాణాలు పోతేనే అధికారులు పట్టించుకుంటారా. అప్పటి వరకు ఎన్నిసార్లు ఫిర్యాదులు, ఆందోళనలు చేసినా పనులు చేయరా. పాలకులు దృష్టికి తీసుకెళ్లితే ఎంతసేపు రేపటి లోగా పనులు చేయిస్తామంటూ చెప్పుతారు. ఎన్నికలు వస్తే తప్పా వీరు పాలకులకు గుర్తుకురారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలి.

– డోకల లక్ష్మి, ఐద్వా పట్టణ కార్యదర్శి, ఆకివీడు

Updated Date - 2022-11-11T23:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising