14 హత్యలు.. 743 దొంగతనాలు
ABN, First Publish Date - 2022-12-31T00:34:27+05:30
జిల్లాలో పోలీస్ యంత్రాంగం సమష్టి కృషితో నేరాలకు అడ్డుకట్ట వేసినట్టు జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ చెప్పారు. భీమవరం పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో 2022 జిల్లా వార్షిక నివేదిక విడుదల చేశారు.
భీమవరం క్రైం, డిసెంబరు 30 : జిల్లాలో పోలీస్ యంత్రాంగం సమష్టి కృషితో నేరాలకు అడ్డుకట్ట వేసినట్టు జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ చెప్పారు. భీమవరం పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో 2022 జిల్లా వార్షిక నివేదిక విడుదల చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘నేర నియంత్రణలో భాగంగా గంజాయి, సారా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద పటిష్ట చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశాం. లోక్ అదాలత్‌లో అత్యధిక కేసు ల రాజీలో రాష్ట్రంలో జిల్లా సముచిత స్థానంలో నిలి చింది. దిశ యాప్‌ను 3.55 లక్షల మందితో డౌన్లోడ్ చేయించి అవగాహన కల్పించాం’ అని వివరించారు. ‘ఈ ఏడాది 14 హత్యలు, 743 దొంగతనాలు జరిగాయి. మొత్తంగా చూస్తే 7,084 కేసులు నమోదయ్యాయి. రూ.6.72 కోట్ల చోరీ సొత్తుకు రూ.3.26 కోట్లు రికవరీ చేశాం. మహిళలు పట్ల జరిగిన నేరాలు 895, పోక్సో యాక్ట్ కేసులు 42, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు 57 నమోదయ్యాయి. మద్యం అక్రమ రవాణా 73, సారా తయారీదారులపై 71 కేసులు నమోదు చేసి 167 మందిని అరెస్టు చేశా రు. 551.12 లీటర్ల ఐఎంఎఫ్ఎల్ మద్యం, 368.08 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణాపై 67 కేసులు నమోదు కాగా 157 మంది అరెస్టయ్యారు. ఇసుక అక్రమ రవా ణాపై 27 కేసులు నమో దు చేసి 50 మందిని అరెస్టు చేశాం. గంజా యి కేసులు 16 నమోదు కాగా, 56 మందిని అదుపులోకి తీసుకుని 128.560 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 1260 జూదం కేసుల్లో 5,606 మందిని అదుపులోకి తీసుకుని రూ.1.60 లక్షలు, 492 వాహనాలు, 732 కోళ్లు, 928 కత్తులు స్వాఽ దీనం చేసుకున్నారు. 219 గుట్కా కేసుల్లో 224 మంది ని అదుపులోకి తీసుకుని రూ.35 లక్షల విలువ కలిగిన గుట్కా స్వాధీనం చేసుకున్నారు. 630 రోడ్డు ప్రమాదా ల్లో 191 మంది చనిపోగా, 439 మంది గాయపడ్డారు. స్పందనలో 1860 ఫిర్యాదులు రాగా, 92 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. 1,673 ఫిర్యాదుల్లో ఇరు వర్గాలకు రాజీ చేశారు. సమావేశంలో ఏఎస్పీ సుబ్బరాజు, సెబ్ ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ బి.శ్రీనాథ్ ఉన్నారు.
న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
నూతన సంవత్సర సంబరాల్లో అర్ధరాత్రి ఆరు బయట వేడుకలకు అనుమతులు లేవని ఎస్పీ తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 31వ తేదీ రాత్రి 12 గంటల నుంచి సెక్షన్ 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉంటున్నందున బహిరంగ ప్రదేశాలలో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ సంఖ్య లో వ్యక్తులు గుమికూడటం నిషేధమన్నారు. న్యూఇయ ర్ వేడుకల్లో ప్రజలు ఎక్కువ సంఖ్యలో బహిరంగ ప్ర దేశాలు, రోడ్ల కూడళ్లలో గుమిగూడటం, బహిరంగ పార్టీలు, పెద్ద పెద్ద ధ్వనులతో లౌడ్ స్పీకర్లు/డీజేలు పెట్టి ప్రజాశాంతికి భంగం కల్గించరాదన్నారు. హా స్పిటల్స్, వృద్ధాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాం తాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలు పెట్టరాదు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలతో ర్యాష్ డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్, బైక్, కార్ రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సెల్‌ఫోన్ పోయిందా..
91549 66503 నెంబరుకు వాట్సప్ చేయండి : ఎస్పీ రవిప్రకాశ్
సెల్ఫోన్లు జారి పడిపోయినా, ఎక్కడయినా మర్చిపోయినా, ఎవరైనా దొంగిలించినా వాట్సాప్ నెంబరు 91549 66503కు వివరాలు పెడితే ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఫోన్లు గుర్తిస్తామని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ తెలిపారు. ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ద్వారా ఇప్పటి వరకు 200 ఫిర్యాదులు అందగా రూ.25 లక్షల విలువైన 105 ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామన్నారు. ఎవరికైనా ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని కోరారు. లేని పక్షంలో ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - 2022-12-31T00:34:31+05:30 IST