ముగిసిన సీపీఐ జిల్లా మహా సభలు
ABN, First Publish Date - 2022-08-05T05:11:08+05:30
సీపీఐ జిల్లా 26వ మహాసభలు మూడో రోజు గురువారంతో ముగిశాయి.
జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావు, కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక
భీమవరం అర్బన్, ఆగస్టు 4 : సీపీఐ జిల్లా 26వ మహాసభలు మూడో రోజు గురువారంతో ముగిశాయి. మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావుతో పాటు 9 మంది పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులను, 31 మంది జిల్లా సమితి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా కలిశెట్టి వెంకట్రావు, చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాం ప్రసాదు, బొద్దాని నాగరాజు, వైట్ల విద్యాధర్, కళింగ లక్ష్మణరావు, సికిలే పుష్పకుమారి, నెక్కంటి క్రాంతి కుమార్, కార్యవర్గం ఆహ్వానితుడిగా టి.అప్పలస్వామి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విలే కరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఎంపికైన కోనాల భీమారావు మాట్లాడుతూ జిల్లాలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సాగునీరు, తాగునీరు, కాలుష్య నివారణకు ఉద్యమిస్తామన్నారు. రైతుల ధాన్యం బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, జిల్లా కేంద్రం భీమవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, కార్యాలయాలు ప్రజలకు చేరువలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సభలో తీర్మానించామన్నారు. వరి రైతాంగ సమస్యలతో పాటు కొబ్బరి, ఆక్వా, అరటి తదితర వాణిజ్య పంటలను పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కోస్తా తీర ప్రాంత అభివృద్ధి, ప్రజలలెదుర్కొంటున్న సమస్యలు పరిష్కరానికి తీర్మానాలు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్టు భీమారావు తెలిపారు.
Updated Date - 2022-08-05T05:11:08+05:30 IST