జాతీయ నాయకులను.. స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN, First Publish Date - 2022-08-04T05:51:14+05:30
నిస్వార్థమైన సేవలు అందించిన జాతీయ నాయ కులను స్ఫూర్తిగా తీసుకుని యువత వారి అడుగుజాడల్లో నడవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.
కలెక్టర్ ప్రశాంతి
భీమవరం టౌన్, ఆగస్టు 3: నిస్వార్థమైన సేవలు అందించిన జాతీయ నాయ కులను స్ఫూర్తిగా తీసుకుని యువత వారి అడుగుజాడల్లో నడవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75 అడుగుల జాతీయ జెండాతో కేజీఆర్‌ఎల్ కళాశాల విద్యార్థుల ర్యాలీని ఆమె ప్రారంభించి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. విదేశాల్లో గొప్ప చదువులు చదివిన మన జాతీయ నాయకులు పలువురికి బ్రిటీష్ ప్రభుత్వం పెద్ద ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా, ప్రలోభ పెట్టినా వారు తృణ ప్రాయంగా తిరస్కరించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారన్నారు. అనేక మంది వారి జీవితాలను త్యాగం చేసి మనమందరం స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పించారన్నారు. ఆర్డీవో దాసి రాజు, కేజీఆర్‌ఎల్ కళాశాల అధ్య క్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), కార్యదర్శి ఎం.రామమనో హర్, కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్, శ్రీవిజ్ఞానవేదిక కన్వీనర్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎ.ధనలక్ష్మి, కంతేటి వెంకట్రాజు, నరహరి శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆజాదీ కా అమృతోత్సవాల్లో కలెక్టర్ సెల్ఫీ
ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సెల్‌ఫోన్ ఐకాన్‌కు కలెక్టర్ పి.ప్రశాంతి సెల్ఫీ తీసుకున్నారు. భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌లో ఆమె స్వయం గా సెల్ఫీ తీసుకున్నారు.
Updated Date - 2022-08-04T05:51:14+05:30 IST