ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సక్రమంగా ధాన్యం కొనుగోలు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-12-15T00:30:49+05:30

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా సక్రమంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, దీనివల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారు లను ఆదేశించారు.

లంకలకోడేరులో ధాన్యం పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 14 : ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా సక్రమంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, దీనివల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారు లను ఆదేశించారు. లంకలకోడేరులో ఆర్‌బీకే కేంద్రం, రైసు మిల్లును బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజులు లోపుగా నగదు జమ చేస్తారన్నారు. ఆర్‌బీకేలో ఎంత మంది రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశారు, ఎంత మందికి సొమ్ములు చెల్లించారు. ఇంకా ఎంత మందికి చెల్లించాలి వంటి వివరాలను కంప్యూటర్‌లో, రిజిస్టర్లలో పరిశీలించారు. అనంతరం గ్రామంలోని రైసు మిల్లును తనిఖీ చేసి ధాన్యం నమూనాలను, తేమ శాతం ఎలా చూస్తున్నారు వంటి అంశాలను, రికార్డులను పరిశీలించారు. సివిల్‌ సప్లయీస్‌ అధికారి ఎన్‌.సరోజ, ఏఎస్‌వో ఎం.రవి శంకర్‌, వ్యవసాయ అధికారి అబ్దుల్‌ రహీం, రైతు భరోసా కేంద్రం సిబ్బంది ఉన్నారు.

21 రోజుల్లోనే ధాన్యం సొమ్ములు : జేసీ

పోడూరు/పెనుమంట్ర, డిసెంబరు, 14 : కొను గోలు చేసిన ధాన్యానికి చెల్లించాల్సిన సొమ్ము 21 రోజుల్లోనే రైతుల ఖాతా ల్లోకి జమ చేసేందుకు చర్యలు తీసుకున్నామని జేసీ మురళి పేర్కొన్నారు. పోడూరు మండలం జిన్నూరు 1, 2 ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ముందుగా నమోదు చేసుకుని ఇచ్చిన సమయానికి ధాన్యం తరలించి సులభంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. జిన్నూరులోని రైస్‌మిల్లును తనిఖీ చేసి ధాన్యం నిల్వలను, ట్రక్‌షీట్‌లను, రికార్డులను పరిశీలించారు. ఇక నుంచి రైస్‌మిల్లులను తరచూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. తహసీల్దార్‌ ఆర్‌వీ.కృష్ణారావు, వ్యవసాయశాఖాధికారి జి.సత్యనారాయణ, ఆర్‌ఐ కందుల రాంబాబు జేసీ వెంట ఉన్నారు.

ఫ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతోందని, రైతులకు మరింత అవగాహన కల్పించాలని జిల్లా జేసీ మురళి అధికారులను ఆదేశించారు. పెను మంట్ర మండలం మార్టేరులోని 1,2 రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గన్నీ బ్యాగుల ఇబ్బందులు ఎక్కడా లేవన్నారు. మార్టేరులోని లక్ష్మీగణపతి ట్రేడర్స్‌ రైస్‌ మిల్లును జేసీ తనిఖీ చేశారు. ధాన్యంసేకరణకు సంబంధించిన వివరాలు ఎప్పటిక ప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. మిల్లరులు అవకతవకలకు పాల్పడి నట్టుగా తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్‌ అశోక్‌ వర్మ, ఏవో దుర్గా మాధురి, వీఆర్వో చిన్నారావు, మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

––––––––––––––––––

Updated Date - 2022-12-15T00:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising